బిజినెస్

హంబంటోటా రేవు చైనాకు అప్పగింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, డిసెంబర్ 9: లంక దక్షిణాది రేవు హంబంటోటాను చైనాకు అప్పగించింది. 99 ఏళ్ల లీజు పద్ధతిలో కీలకమైన రేవును కమ్యూనిస్టు దేశానికి అప్పగించడాన్ని పార్లమెంటులో అన్ని ప్రతిపక్షాలు నిరసించాయి. అయితే ముందు చేసుకున్న ఒడంబడిక ప్రకారం హంబంటోటాను లాంఛనంగా అప్పగిస్తున్నట్టు శ్రీలంక ప్రధాన మంత్రి రనీల్ విక్రమసింఘే శనివారం పార్లమెంటులో ప్రకటించారు. చైనా మర్చంట్ పోర్టు హోల్డింగ్స్ కంపెనీ (సీఎంపోర్టు) ఈ రేవును ఇనె్వస్ట్‌మెంట్ జోన్‌గా అభివృద్ధి చేస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
ప్రధాని విక్రమసింఘే గత ఏప్రిల్‌లో చైనా పర్యటన సందర్భంగా చైనా వౌలిక సదుపాయల కల్పన ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి ఓ ఒప్పందం చేసుకున్నారు. లంక మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్స తన సొంత జిల్లాలో చైనా ప్రాజెక్టులు ఏర్పాటు తలపెట్టారు. హిందూ మహాసముద్ర తీరంలో హంబంటోటా పోర్టును తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ యోచనగా ఆర్థిక మంత్రి రవి కరుణనాయకే ఇంతకుముందే ప్రకటించారు. హంబంటోటా రేవు చైనాకు లాంఛనంగా అప్పగించే నిమిత్తం పార్లమెంటులో ఓ కార్యక్రమంలో ప్రధాని విక్రమసింఘే మాట్లాడుతూ ‘దీనివల్ల ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోతాయి. పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతుంది. అలాగే ఎకనామిక్ జోన్‌గా ఆవిర్భవించి అటు అభివృద్ధి ఇటు పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది’ అని ప్రకటించారు. అయితే అభివృద్ధి పేరుతో చైనా కంపెనీకి భారీగా పన్నుల రాయితీని ప్రకటించడంపై ప్రతిపక్ష పార్టీలు తప్పుపట్టాయి. జాతీయ సంపదనను చైనాకు ధారాదత్తం చేస్తున్నారని ప్రతిపక్షాలు, ట్రేడ్ యూనియన్లు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.

చిత్రం..హంబంటోటా రేవు