బిజినెస్

బయ్యారం ఉక్కు హుళక్కేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, డిసెంబర్ 9: గత కొన్ని సంవత్సరాలుగా ఊరిస్తున్న బయ్యారం ఉక్క్ఫ్యుక్టరీ హుళక్కేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖమ్మం జిల్లా పాల్పంచలో ఉక్కు ఫ్కాక్టరీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాయ. విభజన చట్టం హామీల్లో భాగంగానే ఖమ్మం జిల్లాలో కొత్త స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. సాధ్యసాద్యాలపై నివేదిక అందగానే అత్యాధునిక ఎలక్ట్రికల్ ఆర్క్, ఫర్నేస్ (ఈఎఎఫ్) విధానంతో ప్లాంటును పాల్వంచలో ఏర్పాటు చేస్తామని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్రసింగ్ తాజా ప్రకటన చేశారు. దీంతో మహబూబాబాద్ జిల్లా ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విభజన చట్టంలో భాగంగా బయ్యారంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే పలుమార్లు నివేదికలు తెప్పించుకున్న కేంద్రం నేడో రేపో ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లే ఇచ్చి అకస్మాత్తుగా పాల్వంచలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న తాజా నిర్ణయంతో శనివారం ఆ ప్రభుత్వాల దిష్టిబొమ్మను సీపీఐ నాయకులు దగ్ధం చేశారు. ఖమ్మం జిల్లా పాల్వంచలో ఉక్క్ఫ్యుక్టరీని ఏర్పాటు చేస్తూ ఏళ్ల తరబడి ప్రతిపాదనలో ఉన్న బయ్యారం ఉక్క్ఫ్యుక్టరీని రద్దుచేసే నిర్ణయం పట్ల సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బి.అజయ్ తీవ్రంగా దుయ్యబట్టారు. 2014 ఏపీ పునరుద్ధరణ చట్టం ప్రకారం తక్షణమే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాడ్ చేశారు. కేంద్ర ఉక్కుపరిశ్రమ శాఖ మంత్రి బీరేంద్రసింగ్ నికాన్ సంస్థ నివేదిక వచ్చిన తర్వాతే బయ్యారం ఉక్కుపరిశ్రమ ఏర్పాటు అంటూ నివేదిక, కమిటీల పేర పార్లమెంట్‌లో ఆమోదించిన తర్వాత కాలయాపన చేయడం శోచనీయం అన్నారు. బయ్యారం ఉక్కుపరివ్రమ ఏర్పాటు చట్టం అమలు చేయకుండా పాల్పంచలో తుక్కు ఆధారిత ఉక్కు పరిశ్రమ అంటూ మభ్య పెట్టడం తగదన్నారు. పాల్పంచ స్పాంజ్ ఐరన్ పరిశ్రమ మూసివేసినచోటే కొత్త పరిశ్రమ ఏర్పాటుకు స్వాగతిస్తున్నామని కేంద్ర మంత్రి బయ్యారం ఉక్కుపరిశ్రమపై మీనమేషాలు లెక్కించడం తగదన్నారు. పాల్పంచలో ఉక్క్ఫ్యుక్టరీ పేరిట బయ్యారంలో పరిశ్రమ ఏర్పాటుకు మొండిచేయి చూపే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మరోవైపు రెండు నెలల కిందట అప్పటి కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, కేంద్ర ఉక్కుశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింఘ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ను కలసి బయ్యారంలో ఉక్క్ఫ్యుక్టరీ నిర్మాణంపై చర్చించారు. ఇక్కడ ఉక్క్ఫ్యుక్టరీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలపడంతో ఈ ప్రాంత నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. అప్పటికే బయ్యారంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటుపై టాస్క్ఫొర్స్ అధ్యయనం కూడా పూర్తయింది. ఆ అధ్యయనంలో హెమటైట్ ఓర్ 10 మిలియన్ టన్నులు, మెగ్నటైట్ ఓర్ 400 టన్నులు ఉన్నట్లు టాస్క్ఫొర్స్ గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నిపుణులతో కూడిన టాస్క్ఫోర్స్ బృందం అధ్యయనం చేసి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఫలితంగానే కేంద్ర మంత్రులు సమావేశమై ఈవిషయంపై చర్చించారు. బయ్యారం చుట్టుపక్కల ప్రాంతాల్లో గనుల నిక్షేపాల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం బయ్యారంలో ఉక్కునాణ్యత, పరిణామంపై పరిశోధించి వెంటనే నివేదిక ఇవ్వాలని కేంద్ర మంత్రిత్వ శాఖ కోరింది. ఈ నేవేదిక వచ్చిన వెంటనే పరిశ్రమ ఏర్పాటుకు సన్నహాలు ప్రారంభిస్తామని కేంద్రం తెలిపింది. ఇంతలోపే తెరపైకి పాల్పంచ ఉక్క్ఫ్యుక్టరీ రావడం మహబూబాబాద్ జిల్లా వాసుల్లో తీవ్ర అసంతృప్తి రగులుతోంది. బయ్యారంలో ఉక్క్ఫ్యుక్టరీ నిర్మాణం ద్వారా గిరిజన ప్రాంతంగా ఉన్న మహబూబాబాద్ జిల్లాలోని యువతకు ఉపాధి దొరుకుతుందని ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నిరాశ ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

చిత్రం..జిల్లా కేంద్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న సీపీఐ నాయకులు