బిజినెస్

ఆ ఆలోచన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూన్ 2: ఇప్పట్లో సొంతగా స్మార్ట్ ఫోన్లను తయారు చేయాలన్న ఆలోచన తమ సంస్థకు లేదని, ప్రస్తుతానికి ఈ విషయంలో ఓఇఎం (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్)లతో కలిసే ముందుకు సాగుతామని అంతర్జాతీయ టెక్ దిగ్గజం ‘గూగుల్’ సిఇఓ సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. గూగుల్ ప్రస్తుతం ఓఇఎంల సహకారంతో ‘నెక్సస్’ స్మార్ట్ఫోన్లను తయారు చేయించుకుంటున్న విషయం విదితమే. అయితే ప్రస్తుతానికి ఓఇఎంలతో కలసి ముందుకు సాగాలన్నదే తమ ఆలోచన అని, నెక్సస్ ఫోన్ల తయారీపై మున్ముందు మరింతగా దృష్టి సారిస్తామని సుందర్ పిచాయ్ తెలిపారు. కేవలం స్మార్ట్ఫోనే్ల కాకుండా ఇంకా ఇతర విభాగాలు ఎన్నో ఉన్నాయని, వీటిలో ఏ విభాగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలో ఆలోచించి తదనుగుణంగా వ్యవహరిస్తామని బుధవారం ఒక ఇంటర్వ్యూలో సుందర్ పిచాయ్ వివరించారు.