బిజినెస్

88 వేల ప్రభుత్వ సెల్‌ఫోన్లపై సాలీనా రూ.60 కోట్లు దుబారా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 13: రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వ శాఖల్లో దుబారా ఖర్చు మాత్రం ఆగటం లేదు. రాష్ట్రంలోని మొత్తం మూడున్నర లక్షల మంది ఉద్యోగుల్లో పర్యవేక్షణాధికారులైన 88 వేల మందికి ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం సెల్‌ఫోన్ సౌకర్యం కల్పించింది. శాఖలపరంగా ఎవరు ఏ కంపెనీ సెల్‌ఫోన్‌ను వినియోగించుకుంటున్నప్పటికీ ప్రతి నెల రూ.650ల కనీస అద్దె ప్రభుత్వమే నేరుగా ఆయా కంపెనీలకు చెల్లించే అవకాశం కల్పించింది. అదనంగా వచ్చే బిల్లును జీతం నుంచి ఆయా శాఖల అధిపతులు మినహాయించుకుంటున్నారు. ఇదిలా ఉంటే జియో ఫోన్ రాకతో దాదాపు అన్ని కంపెనీలు కూడా రకరకాల ఆఫర్‌లను ప్రకటించాయి. మూడు మాసాలకు కేవలం రూ.230లకే అన్‌లిమిటెడ్ కాల్స్‌కు అవకాశం లభించింది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ ఆఫర్ లేవీ తనకు పట్టనట్లు వ్యవహరిస్తోంది. మొత్తం 88 వేల ఫోన్‌లను రూ.230ల ఆఫర్‌కు మార్చివేసే విధంగా ఆయా కంపెనీలకు ప్రభుత్వపరంగా ఒక్క ఆదేశం జారీ అయితే సరిపోతుంది. దీనివల్ల అధికారులు, ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. వారికి అదనపు భారం తొలగటం అటుంచి ప్రభుత్వానికి సాలీనా కనీసం రూ.60 కోట్ల రూపాయలు ఖర్చు తగ్గిపోతుంది. ఒక్కో ఫోన్‌పై ప్రస్తుతం నెలకు రూ.630లు చొప్పున సంవత్సరానికి రూ.7560లు వెచ్చిస్తున్నది. అదే కొత్త ఆఫర్‌లోకి వెళితే చెల్లించేది కేవలం రూ.920లు మాత్రమే అంటే ఒక్కో ఫోన్‌పై 6 వేల 640లు ఆదా అవుతుంది. ఈ విధంగా మొత్తం 88 వేల ఫోన్లపై దాదాపు 60 కోట్లు ఆదా జరిగేటపుడు ప్రభుత్వం ఎందుకు ఈ దిశగా ఆలోచించలేకపోతున్నదో అంతుబట్టడం లేదు.