బిజినెస్

గనుల నిర్వాహకులపై కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 13: రాష్ట్రంలో మైనింగ్ తవ్వకాలకు సంబంధించి నిర్లక్ష్యం వహించే మైనింగ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గనులశాఖ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు హెచ్చరించారు. బుధవారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక, మాంగనీస్, గ్రానైట్ తదితర క్వారీల్లో తప్పక నిబంధనలు పాటించాలన్నారు. నిబంధనలు, అనుమతులు లేని వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడే ప్రసక్తే లేదన్నారు. ఇందుకోసం అన్ని మైనింగ్ ప్రాంతాల్లో నిబంధనలు పాటిస్తున్నదీ లేనిది విచారణ జరిపించి నివేదికలు అందజేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఒకరి పేరున అనుమతులు తీసుకొని బినామీ పేర్లతో తవ్వకాలు జరిపినా ఉపేక్షించేది లేదన్నారు. ఎక్కడైనా అక్రమాలు, అవకతవకలు జరిగితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఒకవేళ సిబ్బంది వారితో కుమ్మక్కయితే సంబంధిత సిబ్బందిపై కూడా తీవ్రమైన చర్యలు తీసుకుంటామన్నారు.
గత రెండు రోజులుగా జిల్లాలో జరిగిన మరణాలు బ్లాస్టింగ్ వల్ల జరిగినవి కావని, ఇతర కారణాల వల్ల జరిగినా మనిషి ప్రాణాలు పోకూడదన్నదే ప్రధానమన్నారు. గతంలో భద్రత ప్రమాణాలు పాటించని గనుల్లో తవ్వకాలను నిలిపివేశామని గుర్తు చేశారు. ఎక్కడైనా బ్లాస్టింగ్‌కు సంబంధించి అనుమతులు ఉన్నవారే వాటిని నిర్వహించాల్సి ఉందని స్పష్టం చేశారు. అలాకాకుండా బినామీలు చేపడితే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా కొండలను బ్లాస్టింగ్ చేసేటపుడు బెంచీలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. బెంచీలు ఏర్పాటు చేసుకోకపోవడం వల్ల జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుందని భావిస్తున్నామన్నారు. ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు 14న అమరావతిలో హైలెవెల్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మైనింగ్ శాఖ సిబ్బంది సంఖ్య తక్కువ ఉండటం వల్ల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉందన్నారు. ఇప్పటికే వందలాది కేసులు నమోదు చేసి నిర్వాహకుల నుంచి కోట్లాది రూపాయలను అపరాధ రుసుం కింద వసూలు చేశామని వివరించారు.