బిజినెస్

ఎన్నికల ఫలితాలే చోదకశక్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో లావాదేవీలను ప్రధానంగా ప్రభావం చేయనున్నాయని నిపుణులు పేర్కొన్నారు. అమెరికాలో పన్నుల సంస్కరణలు, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు వంటి ప్రపంచ పరిణామాలపైనా మదుపరులు దృష్టి సారిస్తారని, ఆయా పరిణామాలను బట్టి స్పందిస్తారని నిపుణులు అభిప్రాయపడ్డారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలలో తీసుకోబోయే నిర్ణయాలను కూడా మదుపరులు జాగ్రత్తగా పరిశీలిస్తారని పేర్కొన్నారు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లలో బీజేపీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సర్వేల ఫలితాలతో గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్లు పుంజుకొని ప్రధాన సూచీలు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ పైకి ఎగబాకాయి. ఈ రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు సోమవారం మార్కెట్లు పనిచేసే సమయంలోనే వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్ సర్వేల ఫలితాలకు భిన్నంగా వాస్తవ ఫలితాలు వెలువడితే స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం అధిపతి వినోద్ నాయర్ పేర్కొన్నారు. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు ప్రపంచ స్టాక్ మార్కెట్లలో లావాదేవీల సరళి, అమెరికాలో పన్నుల సంస్కరణలు వంటి అంశాలు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లను ఈ వారం ప్రభావితం చేస్తాయని ఆయన వివరించారు. ఈ అంశాలతో పాటు ఇప్పుడిప్పుడే మొదలయిన పార్లమెంటు శీతాకాల సమావేశాలలో తీసుకోబోయే నిర్ణయాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని కోటక్ సెక్యూరిటీస్‌లోని పీసీజీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ టీనా విర్మాని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడే సోమవారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లలో సానుకూల ధోరణి కొనసాగుతుందని ఆశాభావంతో ఉన్నట్టు అరిహంత్ క్యాపిటల్ మార్కెట్స్ హోల్ టైమ్ డైరెక్టర్ అనితా గాంధీ పేర్కొన్నారు. గత వారం సెనె్సక్స్ గణనీయంగా 212.67 పాయింట్లు (0.63 శాతం) లాభపడింది. నిఫ్టీ కూడా 67.60 పాయింట్లు (0.65 శాతం) పుంజుకుంది. రెండు రాష్ట్రాల ఫలితాలు వెలువడగానే సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు సంతోషంతో పరుగులు పెడతాయని, అయితే ఆ తరువాత మాత్రం దిద్దుబాటుకు లోనవుతాయనే భావన నెలకొని ఉంది. కేవలం వారం రోజులే మార్కెట్లలో లావాదేవీలు క్రియాశీలకంగా కొనసాగుతాయి. ఆ తరువాత సంవత్సరాంతం సమీపిస్తుండటంతో ప్రపంచమంతా హాలీడే మూడ్‌లోకి వెళ్లిపోతుంది. ఈ వారమంతా మార్కెట్లలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంటుందని, నిర్దిష్టమైన షేర్లలో కొనుగోళ్లు జరుగుతాయని, అయితే మొత్తంమీద చూస్తే మదుపరులు ఆచితూచి అడుగులు వేసే ధోరణి నెలకొని ఉంటుందని సామ్‌కో సెక్యూరిటీస్ సీఈఓ జమీత్ మోడీ పేర్కొన్నారు.