బిజినెస్

చివర్లో కొనుగోళ్ల జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 2: గురువారం లావాదేవీల ప్రారంభంనుంచి దాదాపు చివరిదాకా ఆటుపోట్లతో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు చివరి గంటలో భారీగా పుంజుకోవడంతో సెనె్సక్స్ 129 పాయింట్లు లానపడగా, నిఫ్టీ 8,200 పాయింట్లను దాటిపోయింది. ఐరోపా మార్కెట్లు ప్రారంభంలోనే లాభాలతో మొదలు కావడంతో మదుపరులు భారీ ఎత్తున కొనుగోళ్లు జరిపారు. దీంతో లోహాలు, పిఎస్‌యు, బ్యాంకింగ్ రంగాలకు చెందిన స్టాక్స్ మెరిశాయి. దీనికి తోడు స్థూల జాతీయ ఉత్పత్తి (జిడిపి) గణాంకాలు, ప్రోత్సాహకరంగా ఉన్న కార్పొరేట్ సంస్థల నాలుగో త్రైమాసిక ఫలితాలతోపాటుగా ఈ ఏడాది రుతుపవనాలు బాగా ఉంటాయన్న అంచనాలు మదుపరుల సెంటిమెంట్‌కు బలం చేకూర్చాయి. అంతేకాకుండా డాలరుతో రూపాయి విలువ 15 పైసల మేర బలపడ్డం కూడా మార్కెట్‌కు ఊతమిచ్చింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు సైతం బాగానే బలపడ్డాయి. రోజులో చాలాభాగం 26,641-26,885 పాయింట్ల మధ్య ఊగిసలాడిన సెనె్సక్స్ చివరికి 129 పయింట్ల లాభంతో 26,843.14 పాయింట్ల వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 39 పాయింట్లు లాభపడి 8,218.95 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్‌లోని 30 కంపెనీల్లో 23 కంపెనీల షేర్లు 3.2 వాతం దాకా లాభపడ్డాయి. అయితే విప్రో, సన్‌ఫార్మా, లుపిన్, ఐటిసి, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, మహింద్ర, మసింద్ర షేర్లు మాత్రం నష్టాలు చవిచూశాయి. కోల్ ఇండియా షేరు గరిష్ఠంగా 3.2 శాతం లాభపడగా, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, హీరో మోటోకార్ప్ షేర్లు కూడా బాగానే లాభపడ్డాయి. కాగా, అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకొంటోందన్న తాజా గణాంకాల కారణంగా ప్రధాన ఐరోపా మార్కెట్లు ప్రారంభంలోనే లాభాలతో మొదలు కాగా, చైనా, హాంకాంగ్, జపాన్ సింగపూర్, దక్షిణ కొరియాలకు చెందిన షేర్లు లాభపడ్డాయి.