బిజినెస్

‘ముత్యంపేట సుగర్’ పంచాయతీ తీరేదెన్నడో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, డిసెంబర్ 20: రైతుల పట్ల, పంటల విషయంలో పూర్తి అవగాహన ఉన్న నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత తన నియోజకవర్గ పరిధిలోని మెట్‌పల్లి డివిజన్‌లోని ముత్యంపేట చక్కర ఫ్యాక్టరీని పునరుద్ధరించడంలో చొరవ తీసుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో అతి పెద్ద, వ్యవసాయ అధారిత ఫ్యాక్టరీ అయిన ముత్యంపేట నిజాం చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని చేపట్టిన దీక్షలు గురువారంతో 37 రోజులకు చేరాయి. ప్యాక్టరీని తెరిపించాలని ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ ఆధ్వర్యంలో చెరకు రైతులు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలకు అధికార పార్టీ మినహా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని మురళీధర్‌రావు నేతృత్వంలో రైతులకు సంఘీభావం ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సీఎల్‌పీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎలగందుల రమణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు అయిల్నేని సాగర్‌రావు, పార్టీ శ్రేణులు, మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు, జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ గర్వందుల మానసతో పాటు రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, వివిధ సంఘాల మద్దతు లభిస్తున్నా ఫ్యాక్టరీపై ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం పట్ల చెరకు రైతులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.
టీఆర్‌ఎస్ పార్టీ గత సాధారణ ఎన్నికల్లో నెల రోజుల్లో ముత్యంపేట చెరకు ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చి నిలబెట్టుకోకపోవడంతో రైతులు ఆందోళన బాట పట్టారు. దాంతో ఈ ప్రాంత రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాదాపు మూడేళ్ల నుండి ఫ్యాక్టరీ తెరుచుకోకపోవడంతో చాలామంది రైతులు ఇతర పంటలపై దృష్టి సారించినా సరైన అవగాహన లేక, దిగుబడి రాక, గిట్టుబాటు ధర లేక కుంగిపోతున్నారు. ఈ క్రమంలోనే ఎలాగైనా ఫ్యాక్టరీని పునరుద్ధరించి రైతులను, కార్మికులను, ఉద్యోగులను అదుకోవాలని చెరకు రైతులు దీక్షలు చేపట్టారు. రైతు దీక్షలు కొనసాగుతుండగా, వీరికి సంఘీభావంగా అన్ని పార్టీలతో పాటు మద్దతుతో పాటు వివిధ కుల, రైతు అనుంబంధ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, సీఎం కే సీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పరిధిలో చక్కెర ఫ్యాక్టరీ ఉండగా, దీనిపై దృష్టి పెట్టకపోవడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న సమస్య సైతం తన దృష్టికి వస్తే వెంటనే స్పందించి పరిష్కరించే నాయకురాలిగా పేరున్న నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వేలాది మంది రైతులు, ఫ్యాక్టరీలో పనిచేసిన కార్మికులు, ఉద్యోగులు ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని రోడ్డెక్కినప్పటికీ స్పందించకపోవడం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. రైతులు దీక్షలు చేపట్టినప్పటి నుండి పలు మార్లు ఎంపీ జగిత్యాల జిల్లాలో పర్యటించిన చెరకు రైతులవైపు కనె్నత్తి చూడకపోవడాన్ని రైతులు, కార్మికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ‘రైతే రాజు’ అన్న నానుడికి భిన్నంగా చెరకు రైతుల విషయంలో ప్రభుత్వం వ్యవహరించడాన్ని రాజకీయ పార్టీలు సైతం వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ స్పందించి వేలాది మంది రైతులు, కార్మికుల జీవితాలతో ఆటలాడుకోకుండా ఫ్యాక్టరీని తెరిపించాలని, ఈ విషయంలో ఎంపీ కవిత ప్రత్యేక చొరవ చూపాలని రైతులు, కార్మికులు కోరుతున్నారు.
ఫ్యాక్టరీ చరిత్ర: నిజామాబాద్ జిల్లా బోధన్ నిజాం సుగర్ ఫ్యాక్టరీకి అనుంధంగా 1985- 86లో మల్లాపూర్ మండలం ముత్యంపేటలో ఏర్పాటు చేసిన ఈ కర్మాగారం మూడేళ్ల క్రితం లాకౌట్‌కు గురైంది. 2500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో పనిచేసిన ఈ కర్మాగారం మూసివేత వల్ల జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలతో పాటు పలు జిల్లాలోని చెరకు రైతులు, కార్మికులు, కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకనాడు 5 వందల మంది పర్మినెంట్, సీజనల్, కాంట్రాక్ట్ కార్మికులతో ఈ ప్యాక్టరీ పనిచేయగా వివిధ ప్రాంతాల నుండి దాదాపు 150 లారీల్లో ముత్యంపేట కార్మగారానికి చెరకు క్రషింగ్ చేరుతుండేదని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. 2015-16 లో రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా క్రషింగ్ సీజన్‌లో లాకౌట్ ప్రకటించారు. దీంతో రైతులతో పాటు ఉద్యోగులు, కార్మికులు రోడ్డున పడ్డారు.