బిజినెస్

ఆకస్మిక తనిఖీలతో పెరిగిన ఇమేజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 20: ఆకస్మిక తనిఖీలతో వినియోగదారులకు జరిగే మోసాలను అరికట్టడంతో పాటు వారిలో అవగాహనకు కృషి చేసిన తూనికలు, కొలతలు శాఖ పట్ల ప్రజల్లో ఇమేజ్ పెరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం స్థానిక పాత డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 13 జిల్లాల లీగల్ మెట్రాలజీ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. కంట్రోలర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీగా బాధ్యతలు స్వీకరించిన దామోదర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
కంట్రోలర్‌గా దామోదర్ రావడంతో తూనికలు, కొలతల శాఖ ఇంకా బాగా పనిచేసి ప్రజల గుర్తింపు పొందనుందన్నారు. ఇటీవల వినియోగదారుల హక్కుల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఆకస్మిక తనిఖీలు చేయడం వల్ల తూనికలు, కొలతల శాఖ ఇమేజ్ బాగా పెరిగిందన్నారు. ఎక్కడైనా తూనికలు, కొలతల్లో మోసాలు జరుగుతున్నట్లు తెలిస్తే పరిష్కార వేదిక కాల్ సెంటర్ నెం. 1100కు ఫోన్ ద్వారా తెలియజేయాలన్నారు. ఆకస్మిక దాడుల్లో స్థానిక పోలీసుల సాయం, రవాణా శాఖ సిబ్బంది సాయం తీసుకుంటామని తెలిపారు. ఎంఆర్‌పీని మించి అమ్మే వారి ఆగడాలు ఆకస్మిక తనిఖీల వల్ల తగ్గుముఖం పట్టాయన్నారు. వచ్చే జనవరి నుంచి ప్రీ ప్యాక్డ్ అమ్మకాలకు వీలు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి తెలిపారు. చట్టబద్ధంగా ఎవరి నియంత్రణలో వారు సక్రమంగా పని చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. రాష్ట్రంలో 3లక్షల 65వేల వర్తక లైసెన్స్‌లు ఉన్నాయని మంత్రి పుల్లారావు వివరించారు. కంట్రోలర్‌గా బాధ్యతలు చేపట్టిన దామోదర్ మాట్లాడుతూ ప్రతి జిల్లాలో తూనికలు, కొలతల శాఖ ఆఫీసులు ఏర్పాటు చేయడంతో పాటు తగిన సిబ్బందిని సమకూర్చుకోడానికి మంత్రి సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. వర్తకులు, వ్యాపారులను వేధించకుండా వినియోగదారుల హక్కులను పరిరక్షించేలా తూనికలు, కొలతల శాఖ ఆకస్మిత తనిఖీలు నిర్వహిస్తుందన్నారు. పౌర సరఫరాల శాఖ వీసీ ఎండీ రామ్‌గోపాల్ మాట్లాడుతూ దేశంలోనే మొదటిగా ఈ-పోస్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేశామన్నారు. మండల స్టాక్ పాయింట్ల స్థాయిలోనే వేయింగ్ మిషన్లు ఏర్పాటు చేసి పౌర సరఫరాల దుకాణాలకు సరుకులు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. డిప్యూటీ కంట్రోలర్ రామ్‌కుమార్ మాట్లాడుతూ తూనికలు, కొలతల శాఖ ఇటీవలి కాలంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల వల్ల మంచి పేరు వచ్చిందని, ఇదే ఒరవడిని ఇకముందు కూడా కొనసాగిస్తామని వివరించారు.