బిజినెస్

గో ఆధారిత ఉత్పత్తులకు విస్తృత ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, డిసెంబర్ 20: గో ఆధారిత ఉత్పతుల విక్రయాలను సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం బుధవారం ప్రారంభించింది. కృష్ణాపురంలోని వంద ఎకరాల నృసింహ వనం, గోశాలలో ఈవో రామచంద్రమోహన్ ప్రయోగాత్మకంగా విక్రయాలను ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే పాలూరి శేషమాంబ, స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి పిఎస్‌ఎన్ రాజు ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఈవో రామచంద్రమోహన్ విలేఖరులతో మాట్లాడారు. భారతీయ సనాతన సంప్రదాయంలో గోవుకున్న విశిష్టతను భావితరాలకు తెలియజేయాలన్న ప్రధాన లక్ష్యంతో గో ఆధారిత విక్రయాలను ప్రారంభించినట్టు రామచంద్రమోహన్ స్పష్టం చేశారు. దేశీయ గోవులతో తయారు చేసిన ఉత్పత్తులను భక్తులకు అందించడంతో పాటు భారతీయ సంస్కృతిలో, జీవన విధానంలో భాగమైన గోవుల ప్రాముఖ్యతను విస్త్రృతంగా ప్రచారం కల్పించనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే గోవుపేడతో చేసిన పిడకలు, ప్రమిదలు, పిడకల నుండి లభ్యమయ్యే కచ్చిక, గో మూత్రం, స్వచ్ఛమైన నెయ్యి విక్రయాలను అందుబాటులో ఉంచినట్టు ఆయన వివరించారు. గో మూత్రాన్ని 20 లీటర్ల వరకు విక్రయిస్తామని ఆయన చెప్పారు. గృహాల్లో నిత్యాగ్ని హోమం కోసం ప్రత్యేకంగా రాగితో తయారు చేసిన సామగ్రిని భక్తులకు అందించనున్నామని ఆయన వెల్లడించారు. అవకాశాన్ని బట్టి సింహగిరి పై కూడా ప్రత్యేకంగా విక్రయ కేంద్రాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిజేసారు. కాగా, రాష్ట్రంలో ప్రధాన దేవాలయాల్లో గో ఆధారిత ఉత్పతులను భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం ఇదే ప్రథమం.