బిజినెస్

విజయనగరం జోన్‌కు 400 కొత్త బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 20: విజయనగరం ఆర్టీసీ జోన్‌కు కొత్తగా 400 ఆర్టీసీ బస్సులు మంజూరయ్యాయని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.రామకృష్ణ తెలిపారు. బుధవారం ఆయన తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ మంజూరైన వాటిలో ఎక్స్‌ప్రెస్, డీలక్స్, అల్ట్రా డీలక్స్ బస్సులు ఉన్నాయన్నారు. ఈ బస్సులను జోన్ పరిధిలోని విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలకు కేటాయిస్తామన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల విశాఖలోని 150 సిటీ బస్సుల బాడీలను మార్పు చేశామన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 9 నుంచి 13 వరకు ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. ఇందుకోసం హైదరాబాద్, విశాఖపట్నం కేంద్రాల నుంచి 65 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. విజయనగరం జోన్ పరిధిలో ఆక్యుపెన్సీ రేటు పెరగడం వల్ల ఆర్టీసీ నష్టాలు గణనీయంగా తగ్గాయన్నారు. గత ఏడాది రూ.114 కోట్లు నష్టాల్లో ఉండగా రూ.43కోట్లకు తగ్గించగలిగామన్నారు. అలాగే విజయనగరం రీజియన్‌లో రూ.55కోట్లు నష్టాలు రాగా, రూ.33కోట్లుకు నష్టాలు తగ్గాయన్నారు. విజయనగరం జోన్, రీజియన్‌లలో 6 శాతం ఆక్యుపెన్సీ రేటు పెరిగిందని, ఈ కారణంగానే నష్టాలను తగ్గించగలిగామన్నారు. ప్రజల ఆదరణ పెరగడం వల్ల ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్‌ఎం అప్పన్న పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలు
ఆర్టీసీ కార్మికులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్టీసీ విజయనగరం జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.రామకృష్ణ తెలిపారు. ఇక్కడి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఎనిమిది లక్షల రూపాయలతో ఆధునీకరించిన డిస్పెన్సరీని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఈ డిస్పెన్సరీలో అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. జిల్లాలో విజయనగరం, ఎస్.కోట, సాలూరు, పార్వతీపురం డిపోలతోపాటు జోనల్ వర్క్‌షాప్ ప్రాంగణంలో ఉన్న అన్ని యూనిట్ల అధికారులు, ఉద్యోగులు, కార్మికులు ఈ డిస్పెన్సరీ ద్వారా వైద్యసేవలు పొందవచ్చునని చెప్పారు. ముఖ్యంగా కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మాలకొండయ్య అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ పి.అప్పన్న, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఎన్‌విఆర్ వరప్రసాద్, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.వెంకటరాజు, డిప్యూటీ ఇంజనీర్లు శ్రీనివాసరావు, సీతారామునాయుడు, మెడికల్ ఆఫీసర్ టి.దివ్యజ్యోతి, డిపో మేనేజర్ ఎన్‌విఎస్ వేణుగోపాల్, అసిస్టెంట్ మేనేజర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.