బిజినెస్

జాతీయ టెలికం విధానం మార్చినాటికి పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభలో ప్రకటించిన మంత్రి మనోజ్ సిన్హా

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ప్రభు త్వం వచ్చే సంవత్సరం మార్చి నాటికి జాతీయ టెలికం విధా నం- 2018కి తుదిరూపం ఇవ్వాలని భావిస్తోందని కమ్యూనికేషన్ల శాఖ మంత్రి మనోజ్ సిన్హా బుధవారం పార్లమెంటుకు తెలిపారు. టెలికం రంగంలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కొత్త జాతీయ టెలికం విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని టెలికమ్యూనికేషన్ల డిపార్ట్‌మెంట్ (డీఓటీ) భావిస్తోంది. 3జాతీయ టెలికం విధానం- 2018ని రూపొందించే పని ప్రారంభమయింది. 2018 మార్చి నాటికి దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది2 అని సిన్హా బుధవారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో వెల్లడించారు. ఈ కొత్త విధానాన్ని రూపొందించేందుకు వివిధ అంశాలను పరిశీలించడానికి అనేక వర్కిం గ్ గ్రూపులను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. కొత్త జాతీయ టెలికం విధానం ముసాయిదాను ప్రజాభిప్రాయ సేకరణ కోసం ప్రజల ముందు ఉంచుతామని డీఓటీ అధికారులు ఇదివరకే ప్రకటించారు. జాతీయ టెలికం విధానం ముసాయిదాను రూపొందించేందుకు డీఓటీ 13 వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేసింది.