బిజినెస్

బ్యాంకింగ్ షేర్లు కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీఓఐపై ఆర్‌బీఐ చర్యలే కారణం సరికొత్త గరిష్ఠ స్థాయిలకు చేరినా
నిలదొక్కుకోలేక పోయిన కీలక సూచీలు 59 పాయింట్లు తగ్గిన సెనె్సక్స్ 19 పాయింట్లు దిగజారిన నిఫ్టీ
ముంబయి, డిసెంబర్ 20: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఇంట్రా- డేలో సరికొత్త గరిష్ఠ స్థాయిలను తాకినప్పటికీ, ఆ లాభాలను నిలుపుకోలేక పోయాయి. పాడు రుణాల విషయంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ)పై రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఆంక్షలు విధించడంతో బ్యాంకింగ్ రంగ షేర్ల ధరలు దిగజారి, కీలక మార్కెట్ సూచీలు పడిపోయి, మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా పాడు రుణాలు లేదా నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏలు) బాగా పెరిగిపోవడంతో ఆ బ్యాంకుపై ఆర్‌బీఐ తక్షణ దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. తాజాగా రుణాలు ఇవ్వడం, డివిడెండ్లు పంపిణీ చేయడం సహా వివిధ అంశాలపై ఆంక్షలు విధించింది. ఈ విషయాన్ని బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించింది. అప్పటి వరకు లాభాల్లో సాగుతున్న దేశీయ మార్కెట్లలో ఈ విషయం ప్రకంపనలు సృష్టించింది. దాదాపు అన్ని బ్యాం కులూ పాడు రుణాల బారినపడినవే కాబట్టి, వాటన్నింటి షేర్ల ధరలు పడిపోయాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, కోటక్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ నేతృత్వంలో అన్ని బ్యాంకుల షేర్ల ధరలు పడిపోయాయి. 4.35 శాతం వరకు వీటి ధరలు దిగజారాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు బుధవారం సెషన్ రెండో అర్ధ భాగంలో బ్యాంకింగ్ షేర్లను కుదిపివేసిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ తెలిపారు. అమెరికాలో పన్నుల సంస్కరణలకు సంబంధించి తీసుకోబోయే నిర్ణయం కోసం కూడా ఎదురుచూస్తూ మదుపరులు ఆచితూచి అడుగులు వేశారని పేర్కొన్నారు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ బుధవారం సానుకూలంగా ప్రారంభం అయింది. 33,956.31 పాయింట్ల సరికొత్త గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే ఆ స్థాయిని నిలుపుకోలేకపోయింది. నిరర్ధక ఆస్తుల విషయమై నెలకొన్న ఆందోళనతో బ్యాంకింగ్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి పెరగడంతో నిన్నటి ముగింపుతో పోలిస్తే 59.36 పాయింట్లు (0.18 శాతం) తగ్గి, 33,777.38 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకు ముందు నాలుగు సెషన్లలో కలిపి 783.70 పాయింట్లు పుంజుకోవడంతో సెనె్సక్స్ మంగళవారం 33,836.74 పాయింట్ల వద్ద ముగిసింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా బుధవారం 10,494.45 పాయింట్ల సరికొత్త గరిష్ఠ స్థాయిని తాకినప్పటికీ, దానిని నిలబెట్టుకోలేక పోయింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే 19 పాయింట్లు (0.18 శాతం) పడిపోయి, 10,444.20 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ మంగళవారం 10,463.20 పాయింట్ల రికార్డు గరిష్ఠ స్థాయి వద్ద ముగిసిన విషయం విదితమే. బుధవారం బీఎస్‌ఈ బ్యాం కింగ్ సూచీ అత్యధికంగా 0.34 శాతం పడిపోయింది. ఆటో, ప్రభుత్వ రంగ బ్యాంకులు తరువాత స్థానంలో నిలిచాయి. బుధవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా మూడు నెలల గరిష్ఠ స్థాయి నుంచి పడిపోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) మంగళవారం నికరంగా రూ. 407.83 కోట్ల విలువ గల షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత ఇనె్వస్టర్లు (డీఐఐలు) నికరంగా రూ. 357.40 కోట్ల విలువ గల షేర్లను కొనుగోలు చేశారు.
బుధవారం లావాదేవీల్లో డాక్టర్ రెడ్డీస్ బాగా నష్టపోయింది. ఈ కంపెనీ షేర్ విలువ 1.80 శాతం పడిపోయింది. భారతి ఎయిర్‌టెల్ తరువాత స్థానాన్ని ఆక్రమించింది. నష్టపోయిన వాటిలో టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ ఉన్నాయి.