బిజినెస్

రాజమహేంద్రవరం నుంచి ఇండిగో విమాన సర్వీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 21: రాజమహేంద్రవరం నుంచి విమాన సేవలతో ఏటీఆర్ కార్యనిర్వహణను ఇండిగో సంస్థ మరింత బలోపేతం చేసుకుంది. రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభిస్తోంది. జనవరి 9 నుంచి ఈ సర్వీసులు ప్రారంభించనున్నట్టు సంస్థ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సంజయ్‌కుమార్ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లోని మూడు మెట్రో నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లకు రాజమహేంద్రవరం నుంచి తన కార్యాచరణను ప్రారంభిస్తోన్న ఏకైక ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో అని తెలిపారు. రాజమహేంద్రవరంలో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. భారతదేశంలోనే అతిపెద్ద సంస్థగా విస్తరిస్తున్న ఇండిగో విమాన యాన సంస్థ ప్రాంతీయ విస్తరణ ప్రణాళికలో భాగంగా రాజమహేంద్రవరం నుంచి సర్వీసులను ప్రారంభిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం నుంచి ప్రతీ రోజూ హైదరాబాద్‌కు రెండు, బెంగళూరు, చెన్నైలకు ఒక్కో విమాన సర్వీసు నడపనున్నట్టు తెలిపారు. జనవరి 9వ తేదీన ఒకే రోజు నాలుగు విమాన సర్వీసులను రాజమహేంద్రవరం నుంచి ప్రారంభిస్తామన్నారు. అవసరాన్ని బట్టి సర్వీసులు, సమయాలను కూడా మార్చుతామన్నారు. రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌కు రూ.999, చెన్నైకు రూ.1498, బెంగళూరుకు రూ.1499 టిక్కెట్ ధరగా నిర్ణయించామన్నారు. ఢిల్లీ వెళ్లాలంటే హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ ఉంటుందన్నారు. తమ సంస్థ 72 సీట్లు కలిగిన 50 ఏటీఆర్ విమానాలకు ఆర్డర్ పెట్టిందని, అందులో 21 విమానాలు త్వరలో రానున్నాయన్నారు.
2006లో ప్రారంభమైన ఇండిగో సంస్థ ఇప్పటి వరకు 20 కోట్ల మంది ప్రయాణికులకు చేరవేసిందని సంజయ్‌కుమార్ వివరించారు. నవంబర్‌లో 91.5 శాతం ఆక్యుపెన్సీ రేషియో సాధించామన్నారు. సరికొత్త ఏటీఆర్ 72-600 ఎయిర్‌క్రాఫ్ట్, 149 ఎయిర్‌బస్ ఎ320లతో ఇండిగో ఇపుడు రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మార్గం నుంచి కీలక మెట్రో నగరాలైన ఢిల్లీ, కోల్‌కత్తా, ముంబైలను అనుసంధానం చేస్తోందన్నారు. అదే సమయంలో దక్షిణాదిలోని ఈ ప్రధాన మెట్రో నగరాల ద్వారా రాజమహేంద్రవరం నుంచి జైపూర్, కొచ్చి, అహ్మదాబాద్, తిరువనంతపురం, పూణె, మంగుళూరు, గోవా, సింగపూర్, మస్కట్ తదితర ప్రాంతాలకు అనుసంధానం చేయనుందని వివరించారు. 2019 డిసెంబర్ నాటికి సరికొత్త 21 ఏటీఆర్‌లను ప్రాంతీయ నగరాలకు నడుపుతామన్నారు. 1000 ఏటి ఆర్ విమానాలను ఇండిగో నడుపుతూ, దేశంలో అతి పెద్ద సంస్థగా అభివృద్ధి చెందుతూ మరో మారు తన స్థానాన్ని సుస్థిరం చేసుకోనుందన్నారు. సమావేశంలో ఇండిగో సంస్థ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అజయ్ సాహల్ జాస్రా తదితరులు పాల్గొన్నారు.