బిజినెస్

కౌలాలంపూర్‌కు మరో విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 21: విమాన ప్రయాణికులకు శుభవార్త. కౌలాలంపూర్‌కు వచ్చేనెల నుంచి మరో విమానం రానుంది. సంక్రాంతి కానుకగా దీనిని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం మూడు విమానాలు విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్‌కు వెళ్తుండగా ఇది నాలుగోది. ఇది వస్తే విశాఖ నుంచి వెళ్ళే ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుంది. అలాగే అబుదాబి, పూణె, గోవా, కొచ్చి, బెంగళూరుకు మరికొన్ని విమానాలు నడవనున్నాయి. పూణె, వారణాసి, పోర్టుబ్లెయిర్‌కు విమాన సర్వీసులు నడపడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇటీవల పెరిగిన ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని పూణె, రాయపూర్, తిరుపతి ప్రాంతాలకు విశాఖ నుంచి విమాన సర్వీసులు నడపాలని ప్రతిపాదనలున్నాయి. ఈ ప్రాంతాలకు విమానాలు నడపడం ద్వారా ప్రయాణికుల సంఖ్య మరింత పెరగనుంది. ప్రస్తుతం ప్రతిరోజూ 72 విమానాలు విశాఖ నుంచి నడుస్తుండగా, ఇండిగో సంస్థకు చెందిన విమానాలు కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, భువనేశ్వర్, హైదరాబాద్, ఢిల్లీ ప్రాంతాలకు, స్పైట్‌జెట్ నుంచి చెన్నై, హైదరాబాద్‌కు విమానాలు వెళ్తున్నాయి. ఢిల్లీ, దుబాయ్, బెంగళూరుకు ఎయిర్ ఏసియా, ఎయిర్‌ఇండియా విమానాలు నడుపుతోంది. కొత్తగా ‘ఎయిర్ ఒడిశా’ విమాన సర్వీసులను ప్రవేశపెట్టనుంది. ఇవి జగదల్‌పూర్, భువనేశ్వర్ నుంచి నడుస్తాయి. రాత్రి 9 గంటలు దాటిన తరువాత విమానాశ్రయం ఖాళీగా ఉండటం, ఆ టైంలో ఇక్కడి నుంచి వెళ్ళే విమాన సర్వీసులు లేకపోవడంతో ఈ సమయంలో మరికొన్ని కొత్త వాటిని నడపాలని ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ (ఇండియా) అధ్యక్షుడు డి.వరదారెడ్డి కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖను డిమాండ్ చేశారు. పర్యాటక కేంద్రంగా విశాఖ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తుందని, అలాగే నిత్యం పారిశ్రామికవేత్తలు, పెట్టుబడులు పెట్టాలనుకునే విదేశీయుల తాకిడి పెరిగిందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విమాన సర్వీసులు ప్రవేశపెట్టాల్సిందిగా ఆయన కోరారు. ప్రధానంగా అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చెందుతోన్న విశాఖలో వౌళిక వసతులు మరింతగా మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. విమానాల సంఖ్యను పెంచడం, వౌలిక వసతులు మెరుగుపర్చడం ద్వారా ఆర్థిక లక్ష్యాలు నెరవేరుతాయన్నారు.