బిజినెస్

టీఎస్‌ఆర్టీసీకి రెండు జాతీయ స్కాచ్ అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 21: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జాతీయ స్థాయిలో మరోసారి రెండు ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డులు దక్కించుకుంది. ఇప్పటికే వివిధ కేటగిరీలలో ఎన్నో అవార్డులు అందుకున్న ఆర్టీసీ తాజాగా మరో రెండు అవార్డులు అందుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గురువారం న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జివి రమణరావు ఈ అవార్డులను అందుకున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా సీఈవో పవన్‌కుమార్ అగర్వాల్, స్కాచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకున్న రమణరావు సంతోషం వ్యక్తం చేవారు. ప్రయాణికుల ముంగిట్లోకి వజ్ర సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడం, వైద్యపరంగా అనర్హత పొందిన ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పించుట వంటి విధానాల అమలుకు గానూ ఈ అవార్డులు దక్కడంతో సంస్థ ఎండి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, గోదావరిఖనిలకు ప్రత్యేకంగా నడుపుతోన్న వజ్ర, ఏసి బస్సుల ద్వారా అందిస్తున్న సేవలు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉన్నాయని ఎండి తెలిపారు. కార్మికులు, అధికారుల కృషి ఫలితంగానే సంస్థ అభివృద్ధి చెందుతుందన్నారు.