బిజినెస్

హైదరాబాద్‌లో మోటొహబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 21: ప్రముఖ మొబైల్ ఫోన్ల కంపెనీ మోటొరోల ఉభయ తెలుగురాష్ట్రాల్లో మొబైల్ ఫోన్లు విక్రయించే చైన్ నెట్‌వర్క్ ఉన్న సంస్థ బిగ్ సితో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. అన్ని రకాల మోటోరోల ఫోన్ల విక్రయాలు ఒకచోట జరిగే విధంగా మోటో హబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. దీనిలో భాగంగా హైదరాబాద్‌లో తొలి మోటో హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్లు మోటోరోల ఎండి సుధిన్ మాథుర్ తెలిపారు. 185బిగ్‌సి, 140 లాట్ మొబైల్ స్టోర్లు ఉన్నచోట్ల ఈ మోటో హబ్‌ను ఏర్పాటు చేయాలని వ్యాపార ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. మోటోతో భాగస్వామ్యం చేసుకోవడం సంతోషంగా ఉందని బిగ్‌సి సిఎండి బాలు చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు.