బిజినెస్

రాయితీ కార్డుల ద్వారా ఆర్టీసీకి రూ. 9కోట్లు నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 21: సాలీ నా రూ.700 కోట్ల పైగా నష్టాన్ని చవిచూస్తున్న ఏపీఎస్‌ఆర్‌టీసీ లాభాలు గడించకపోయినప్పటికీ వివిధ రూ పాల్లో నష్టాలను గణనీయంగా తగ్గించుకోటానికి గడచిన ఏడాదికాలంగా చేస్తున్న కృషి కొంతమేర ఫలిస్తున్నది. దాదాపు రూ.3వేల 600 కోట్లు పైగా స్థిరమైన నష్టం ఎటూ ఉండనే ఉంది. రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ జరిగితే ఈ నష్టాలు కొంతమేర తగ్గిపోయే అవకాశం లేకపోలేదు. నష్టాల భర్తీ కోసం కనీస సంఖ్యలో ప్రయాణికులు లేని బస్ సర్వీస్‌లు రద్దవుతుంటే ఇదే సమయంలో బస్‌స్టేషన్‌లు, బస్ డిపోల్లో సరికొత్తగా వాణిజ్యపరమైన దుకాణాల ఏర్పాటు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు అద్దెలుకు ఇవ్వటం ద్వారానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు తొలి ఏడు మాసాల్లో 80 కోట్ల రూపాయలు పైగా ఆదాయం లభించింది. ఇందులో అత్యధికంగా కృష్ణాజిల్లాలో రూ.15 కోట్ల 50 లక్షలు ఆదాయం లభించింది. ఆ తర్వాత తిరుపతిలో రూ.10కోట్ల 45 లక్షలు ఆదాయం వచ్చింది. అదే 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి లభించిన ఆదాయం కేవలం రూ.51 కోట్ల 57 లక్షలు మాత్రమే. సంస్థ ప్రస్తుత ఎండీ డాక్టర్ ఎం.మాలకొండయ్య చేపట్టిన సంస్కరణల వల్ల వాణిజ్యపరమైన ఆదాయం 54 శాతం పెరిగింది. రాయితీతో కూడిన వివిధ పథకాల కార్డుల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఏడు మాసాల్లో తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం లభించింది. రీజియన్ల వారీగా నవ్య కార్డులు కర్నూలు జిల్లాలో 34వేల 894 కార్డులు విక్రయించగా 58లక్షల 06వేలు ఆదాయం లభించింది. గుంటూరులో 30వేల 963 కార్డుల ద్వారా రూ.58 లక్షలు, కడపలో 34వేల 204 కార్డుల ద్వారా రూ.56లక్షల 52వేలు, అలాగే విహారీ కార్డులకు సంబంధించి తూ.గోలో 410 కార్డుల ద్వారా రెండున్నర లక్షలు, చిత్తూరులో 360 కార్డుల ద్వారా 2లక్షల 16వేలు, కృష్ణాలో 351 కార్డుల ద్వారా 2లక్షల 10వేలు, వనిత ఫ్యామిలీ కార్డులపై గుంటూరులో 86వేల 317 కార్డుల ద్వారా రూ.63 లక్షలు, చిత్తూరులో 47వేల 984 కార్డుల ద్వారా 41లక్షల 12వేలు, సిల్వర్ కార్డులపై గుంటూరులో 25వేల 718 కార్డుల ద్వారా ఒక కోటీ 92 లక్షలు, కృష్ణాలో 19వేల 414 కార్డుల ద్వారా ఒక కోటీ 65 లక్షల రూపాయలు, తూ.గో. జిల్లాలో 20వేల 710 కార్డుల ద్వారా ఒక కోటీ 55 లక్షల రూపాయల ఆదాయం లభించింది.