బిజినెస్

స్తబ్దుగా ముగిసిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 21: దేశీయ స్టాక్ మార్కెట్ల లావాదేవీల్లో గురువారం ఉత్సాహం కొరవడింది. క్రిస్మస్, సంవత్సరాంతం సమీపిస్తుండటంతో మదుపరులు ఆచితూచి అడుగులు వేయడంతో కీలక మార్కెట్ సూచీలు స్తబ్దుగా సాగాయి. ఖచ్చితంగా చెప్పాలంటే కాస్తంత పడిపోయి ప్రతికూల ధోరణితోనే ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ రెండూ కూడా క్రితం రోజు ముగింపుతో పోలిస్తే అతి స్వల్పంగా తగ్గాయి. ద్రవ్య విధానాన్ని సమీక్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) విధాన కమిటీ డిసెంబర్‌లో సమావేశమయినపుడు, అందులోని కొంత మంది సభ్యులు చమురు ధరలు పెరుగుతుండటం పట్ల, ద్రవ్యోల్బణంపై దాని ప్రభావం, వృద్ధి రేటు పడిపోయే అవకాశం గురించి ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆర్‌బీఐ మినట్స్ వెల్లడించడంతో మదుపరులు గురువారం అప్రమత్తంగా వ్యవహరించారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా కోలుకుంటుండటాన్ని, ద్రవ్యోల్బణాన్ని ఆర్‌బీఐ జాగ్రత్తగా పరిశీలిస్తుండటం మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుండటంతో పాటు మార్కెట్‌ను ఉత్సాహపరిచే అంశాలేవీ లేకపోవడం వల్ల ఇప్పుడు మార్కెట్ సంఘటితం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వౌలిక సౌకర్యాల వృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించడంతో 2017-18 ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో నిర్మాణ రంగంలో పురోగతి ఉంటుందనే ఆశాభావం నెలకొనడం వల్ల నిర్మాణ రంగ కంపెనీల షేర్ల ధరలు గురువారం పెరిగాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం అధినేత వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లలో ఒడిదుడుకులు సంభవించిన రోజుల్లో ఒకటిగా గురువారం నిలిచిపోయింది. చివరలో బీఎస్‌ఈ సెనె్సక్స్ 21.10 పాయింట్లు (0.06 శాతం) పడిపోయి, 33,756.28 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో ఆటో, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, చమురు- సహజ వాయువు రంగాల కంపెనీల షేర్ల ధరలు పడిపోయాయి. సెనె్సక్స్ బుధవారం 59 పాయింట్లు దిగజారిన విషయం విదితమే. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా గురువారం స్వల్పంగా 3.90 పాయింట్లు (0.04 శాతం) దిగజారి 10,440.30 పాయింట్ల వద్ద స్థిరపడింది.
ఇండియన్ బాండ్ల ధరలు కూడా సుమారు సంవత్సరంన్నర కాల కనిష్ట స్థాయికి పడిపోయినట్లు ఆర్‌బీఐ మినట్స్ సూచించాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. క్రిస్మస్, సంవత్సరాంతం సమీపిస్తుండటంతో పెద్ద మొత్తంలో కొనుగోళ్లు జరపడానికి మదుపరులు ఆసక్తి కనబరచలేదు. అమెరికాలో పన్నుల తగ్గింపునకు సంబంధించిన బిల్లు కాంగ్రెస్ ఆమోదం పొందినప్పటికీ, ఆసియా, ఐరోపా మార్కెట్ల లావాదేవీల్లో ఉత్సాహం కనపడలేదు.
ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌ఐఐలు) బుధవారం నికరంగా రూ. 1,505.04 కోట్ల విలువ గల షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత ఇనె్వస్టర్లు (డీఐఐలు) రూ. 146.17 కోట్ల విలువ గల షేర్లను కొనుగోలు చేశారు. గురువారం ఎంఅండ్‌ఎం షేర్ విలువ 3.74 శాతం పడిపోయింది. మారుతి సుజుకి, హెచ్‌యూఎల్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్ షేర్ల ధరలు 1.11 శాతం వరకు దిగజారాయి. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తన ముంబయి పవర్ వ్యాపారాన్ని రూ. 18,800 కోట్లకు అదాని ట్రాన్స్‌మిషన్‌కు విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకోవడంతో ఆ కంపెనీ షేర్ విలువ 8.12 శాతం వరకు పడిపోయింది. కాగా, ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్, హీరో మోటోకార్ప్ షేర్ల ధరలు పెరిగాయి.