బిజినెస్

డీబీ రియాల్టీ షేర్‌కు రెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రం కేటాయింపుల కేసులో ప్రత్యేక కోర్టు నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇవ్వడంతో గురువారం స్టాక్ మార్కెట్‌లో ఈ కేసుతో సంబంధం ఉన్న కంపెనీల షేర్ల ధరలు 20 శాతం వరకు పెరిగాయి. డీబీ రియాల్టీ షేర్ ధర 19.89 శాతం పెరిగి, రూ. 43.70 వద్ద ముగిసింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ)లో ఈ కంపెనీ షేర్ ధర అనుమతించిన గరిష్ఠ పరిమితికి పెరిగింది. యూనిటెక్ షేర్ ధర 11.86 శాతం పుంజుకొని, రూ. 7.92కు చేరుకుంది. సన్ టీవీ నెట్‌వర్క్ షేర్ విలువ 4.51 శాతం పెరిగి, రూ. 982.10కి చేరుకుంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ షేర్ ధర 4.05 శాతం పెరిగి, రూ. 17.97కు చేరుకుంది. ఎస్సార్ షిప్పింగ్ షేర్ విలువ 2.15 శాతం పుంజుకొని, రూ. 28.55కు చేరుకుంది. రాజకీయంగా పెను సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రం కేసులో నిందితులపై అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమయిందని పేర్కొంటూ మాజీ టెలికాం మంత్రి ఎ.రాజా, డీఎంకేకు చెందిన ఎంపీ కనిమోళి సహా నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది.