బిజినెస్

ఆ రాళ్లే నేటి నల్ల బంగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరాంపూర్ రూరల్ డిసెంబర్ 22: సిరుల మాగాణి సింగరేణి ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొంటూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ తవస్తోంది. తెలంగాణలో సిరులను విరజల్లుతూ వేలాది మందిని అక్కున చేర్చుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న సిరుల మాగాణి సింగరేణి 128వ.వసంతాలు పూర్తి చేసుకుని 129వ. వసంతంలోకి అడుగెడుతున్నా సందర్భంగా నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడులకుఅధికారులు,కార్మికులు ఘనంగా జరుపుకోనున్నారు. ఆరణాల కూలి నుండి పదవ వేతన ఒప్పందం వరకు కార్మిక శ్రమ శక్తి ఎంతో దాగి ఉంది. నిత్యం సమ్మెలతో పారిశ్రామిక అశాంతి ఏర్పడి సంస్థ మనుగడ ప్రశ్నార్ధకంగా మారిన తరుణంలో కార్మిక లోకం ఏకమై బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమిసూ తవస్తుంది. ఏటేటా కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటు రికార్డులు సాధిస్తూ కోల్ మార్కెట్‌లోవిదేశి బొగ్గు నాణ్యతలో పోటీపడుతూ బొగ్గు ఉత్పత్తికి ప్రాధాన్యతనిస్తోంది.బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా ఇతర వ్యాపార సంస్థలోకూడా తనకు తానే సాటి అని నిరుపించుకుంటూ జైపూర్‌లో 1200 మెగావాట్ల థర్మల్ పవర్ విద్యుత్ ప్రాజక్టుకు శ్రీకారం చుట్టి దిగ్విజయంగా పూర్తిచేసి మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్‌కు రంగం సిద్ధం చేస్తోంది. ఒడిసాలోని నైని బొగ్గు బ్లాక్‌లను దక్కించుకొని బొగ్గుఉత్పత్తికి చేయాడానికి కనె్సల్టెన్సీ విభాగాలను నియమించుకుంటూ సింగరేణి ప్రస్థానాన్ని విస్తరిస్తోంది. పర్యావరణాన్ని కాపాడుతూ బొగ్గు రవాణా వేగాన్ని పెంచడానికి బొగ్గు రవాణాకు వ్యాగన్ లోడింగ్ విదానాన్ని సిఎస్‌పి లను వృద్ధి చేస్తున్నారు. ఇతర సంస్థలలో కూడా సింగరేణి విస్తరింపజేసుకుంటు తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది.
ఆసక్తి కరంగా బయట పడ్డ బొగ్గు నిల్వలు...
బొగ్గు గనుల అవిర్భావం చాలా ఆసక్తికరంగా జరిగింది. మన రాష్ట్రంలో బొగ్గు నిక్షేపాల ఉనికి తొలిసారి కనుగొన్నది 19వ శతాబ్దం మధ్యలో. సరైన సౌకర్యాలు లేక భద్రాది రాముని సందర్శనకు వచ్చే యాత్రికులుఅడువుల గుండా ప్రయాణించేవారు. మార్గ మధ్యంలో విశ్రాంతి కోసం భోజనం కోసం వంట కోసం రాళ్లను పేర్చి మంట చేయగా పుల్లలతో పాటు రాళ్లు మండటంతో విస్తుపోయారు, ఇల్లందు గ్రామంలో ఇది జరగడంతో గ్రామంలోని క్రిష్టయన్ మిషన్‌వారు నాటి ప్రభుత్వానికి తెలిపారు. అనేక పరిశోధన అనంతరం ఆ రాళ్లే ప్రస్తుతం నల్ల బంగారంగా రుజవైంది. ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం బొగుగ నిక్షేపాల అనే్వషణకు శ్రీకారం చుట్టింది భూగర్భ శాస్త్ర వేత్త డాక్టర్ విలియం కింగ్ 1871 సంవత్సరంలో పరిశోధన నిర్వహించి గోదావరిలోయ వెంట ఆపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని తెలుసుకున్నారు. అ తర్వాత బొగ్గు వెలికి తీయడానికి ఏర్పాట్లు జరిగాయి
చితుకుతున్న కార్మికుల బతుకులు...
నష్టమొస్తే తమ కష్టంగా భవించి అహర్నిశలు శ్రమించి లాభాల వైపు మళ్లించి తమ బతుకులు చీకటి పాలవుతున్నా దేశానికి వెలుగులు పంచిన కార్మికుల కాలక్రమేణా సంస్థకు భారమైపోయారు గతంలో కార్మికులతోనే ఉత్పత్తి సాధించిన సింగరేణి క్రమేనా అధునాతన యంత్రాలను రావడంతో కార్మికుల సంఖ్యను తగ్గించే పనిలో పడింది సంస్కరణలను వేగంగా అమలు చేయడం వల్ల కార్మికులకు తీరని నష్టం వాటిల్లుతోంది. గతంలో కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులు నేడు సింగరేణి యాజమాన్యం పూర్తిగా హరించి వేస్తోంది. కార్మిక ప్రధానమైన సమ్మె హక్కును ఉక్కు పాధంతో అణిచివేయాలని నిశ్చయించింది. అందుకు మాస్టర్ కోసం విధానాన్ని అమలు చేసింది.
భారీ యాంత్రికీకరణ దిశగా అడుగులు...
ప్రభుత్వం సింగరేణి సంస్థను భారీ యాంత్రికరణ దిశగాపయనింపజేస్తున్నారు. లాభాలే లక్ష్యంగా మానవ వనరులకంటే యంత్రాలపై ఆధారపడి అధిక ఉత్పత్తి సాంధించే దిశగా అడుగులు కొనసాగుతున్నాయి. మొత్తంగా 14 ఒసిపిలతోపాటు 32 భూగర్భనులు కొనసాగుతున్నాయి. తెలంగాణ కల్పవల్లి సింగరేణి నల్ల బంగారు నేల ఉమ్మడి జిల్లాల వారిగా గోదావరి పరీవాహక ప్రాంత వ్యాప్తంగా 150 సంత్సరాలకు సరిపడా తరగని బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు శాస్ర్తియ అధ్యయనాలు స్పష్టం చేశాయి.సాంకేతిక పరిఙ్ఞనంతో సింగరేణి సంస్థ కోట్లాది రూపాయలు వెచ్చించి భారీ యంత్రాలను సమీకరించుకొని వాటి ద్వారా అధిక బొగ్గు ఉత్పత్తికే ప్రాధన్యత నిస్తుంది. భూగర్భ గనులు అనేకం మూత పడటంతో వేలాది మంది కార్మికులు పదవీ విరమణ పోందిన స్థానంలో కొత్తవారితో నూతన యాంత్రీకరణతో ఉత్పత్తి తీయాడంపైనే సంస్థ దృష్టి పెడుతోంది. దీంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి సాధించాలన్నదే సంస్థ ముఖ్య లక్ష్యంగా ఎంచుకొంది.
తెలంగాణకు తొలికానుగా సింగరేణి విద్యుత్ ....
సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా వివిధ వ్యాపార రంల్లోకి తన సామ్రాజ్యాన్ని విస్తరించేందుకుప్రణాళికలు సిద్ధంచేసింది అందులో భాగంగా మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండంలో 1200 మెగావాట్ల సామర్థ్యంతో ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించింది.2010లో మొదటి ప్లాంట్ నిర్మాణం చేపట్టి సంస్థ ఆశించిన మేరకు పనులు పూర్తి చేసింది.బొగ్గు ఉత్పత్తినుండి మొదటిసారిగా విద్యుత్ ఉత్పత్తివైపు దృష్టి సారించింది. 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధిస్తూ మూడో యూనిట్ నెలకొల్పేదిశగా ఆడుగులు వేస్తోంది. వేగంగా బొగ్గు రవాణాకు వ్యాగన్‌లో లోడింగ్ విధానాన్ని సిఎస్‌పిలను వృద్ధి చేస్తున్నారు.
బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా ....
సింగరేణి సంస్థ బోగ్గు ఉత్పత్తిలోనే కాకుండా కార్మిక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి విజయాలను సాధిస్తుంది. పర్యావరణ పరిరక్షణలో కాలుష్యాన్ని తగ్గిస్తూ విద్యుదుత్పత్తి సాధించే దిశగా ముందుకు సాగుతుంది పర్యావరణ పరిరక్షణలో భాగంగా అటు ప్రభుత్వం, ఇటు సంస్థ ప్రతి యేటా లక్షల మొక్కలను నాటుతున్నారు.
వృత్తి శిక్షణలో ఉపాధి....
సింగరేణి సేవా సమితి ద్వారా అనే వృత్తి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కార్మికుల భార్య, పిల్లలకు వృత్తి శిక్షణ కోర్సుల్లో శిక్షణనిస్తూ వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారు.టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, కుట్లు అల్లికలు, బ్యూటీషన్ కోర్సులను నేర్పిస్తు మహిళలు అర్థికంగా నిలదొక్కుకునేలా చేయుతనందిసున్నారు. యువతకు సింగరేణి ఆణిముత్యాలు పేరుతో కార్మికుల పిల్లలకు సింగరేణి వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించి వివిధ కంపెనీలకు చెందిన పారిశ్రామిక సంస్ధల్లో ఉన్న ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పించారు.
సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమం, ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. సంస్థలో ఇప్పటికే 50 సవంత్సరాలు పైబడి ఉన్న కార్మికుల కోసం మీకోసం మీ ఆరోగ్యం కార్యక్రమాన్ని రూపొందించి ఉచిత ఆరోగ్య కేంద్రాలను ఎర్పాటు చేసి వారికి చికిత్స నందించారు. కాలనీలలో త్రాగు నీరు, డ్రైనేజి పైపులైన్లు జామ్ కావడం, పందుల సైర విహారం, వర్షాకాలంలో క్వార్టర్లు పాడవడం తదితర సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ల్లారు. కోట్లు ఖర్చు చేస్తున్న కార్మికుల కోసం అదనపు నిధులను కేటాయించారు.
*
సింగరేణి ప్రస్థానం మొదలైందిలా...
*
1871 డాక్టర్ విలియమ్
కింగ్స్ బొగ్గు నిక్షేపాలు గుర్తించారు.
1886 హైదరాబాద్ దక్కన్ కంపెనీగా
లండన్‌లో ఏర్పాటు
1889 ఖమ్మం జిల్లా రోంపెడ్
గ్రామంలో బొగ్గు ఉత్పత్తికి శ్రీకారం
1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్
కంపెనీ లిమిటెడ్‌గా పేరు మార్పు
1945 నిజాం సవాబు సింగరేణి
షేర్లుకొనుగోలు చేశారు.
1948 జయ్ కంపెనీ షేటిల్‌కార్
యంత్రాల ప్రవేశం
1949 రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి సింగరేణి
1951 ఎలక్ట్రానిక్ యంత్రాల ప్రవేశం
1953 ఎలక్ట్రానిక్ క్యాప్ ల్యాంప్ వినియోగం
1975 ఓసిపిల ప్రారంభం
1981 ఎల్ హెచ్‌డి యంత్రాలు వినియోగం
1983 లాంగ్ వాల్ యాంత్రాల ప్రారంభం
1986 గనుల్లో కంప్యూటర్ల విధానం అమలు
1998 కార్మిక సంఘాల ఎన్నికలు
2003 లాభాల బాటలో పయనం
2006 కంటిన్యూయర్స్ మెనర్స్ ద్వారా ఉత్పత్తి
2010 మట్టినుండి ఇసక తీసే
ప్రక్రియ ప్రారంభం
2016 జైపూర్ థర్మల్ విద్యుత్ ప్రారంభం
*