బిజినెస్

రోహిణి ఆశ్రమ అధిపతిని హాజరు పరచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: బాలికలను నిర్బంధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తర ఢిల్లీలోని రోహిణి ఆశ్రమం వ్యవస్థాపకుడు వీరేందర్ దేవ్ దీక్షిత్‌ను జనవరి 4లోగా తమ ఎదుట హాజరుపరచాలని ఢిల్లీ హైకోర్టు సిబిఐని శుక్రవారం ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ హరిశంకర్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఆధ్యాత్మిక్ విశ్వ విద్యాలయ’ పేరుతో ఆశ్రమం నడుపుతున్న వీరేందర్ దేవ్ అధీనంలో బాలికలు నిర్బంధంలో ఉన్నారన్న ఆరోపణలు మీడియాలో వెల్లువెత్తాయి. తమ అధీనంలో మహిళలెవరూ నిర్బంధంలో లేరని ఆశ్రమ నిర్వాహకులు చెబుతున్నప్పటికీ అనేక అనుమానాలు కలుగుతున్నాయని కోర్టు భావించింది. వారంతా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉంటే- తలుపులు బంధించడం ఎందుకని కోర్టు ప్రశ్నించింది. అంతా సవ్యంగా ఉంటే ఆశ్రమ అధిపతి ఆచూకీ లేకుండా పోవడం ఏమిటని కోర్టు నిలదీసింది. ఆశ్రమంలో ఆర్థిక లావాదేవీలపైనా విచారణ జరగాలని, ఎక్కడెక్కడి నుంచి వీరికి విరాళాలు అందుతున్నాయో లెక్కలు తేలాలని న్యాయస్థానం పేర్కొంది. ఆశ్రమంలో బాలికలు, యువతుల పరిస్థితిపై సిబిఐ విచారించి సమగ్ర నివేదిక అందజేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు.