బిజినెస్

మాల్యాకు బిగుస్తున్న ఉచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి లండన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్ డాన్ విజయ్ మాల్యాకు ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై దాఖలైన ఫెరా కేసు జనవరి 4న విచారణకు రానుంది. నిజానికి శుక్రవారం ఢిల్లీ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు విచారించాల్సి ఉంది. అయితే మెజిస్ట్రేట్ దీపక్ షెరావత్ సెలవులో ఉండడంతో విచారణకు రాలేదు. ఎన్ని సమన్లు జారీ చేసినా తప్పించుకు తిరుగుతున్న వ్యాపారవేత్త మాల్యాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రకటిత అపరాధిగా ప్రకటించాలని కోర్టును కోరింది. ‘మాల్యా ఇంటికి, ఆఫీసుకు సమన్లు పంపాం. అలాగే దినపత్రికలలో ప్రకటనలు ఇచ్చాం. అయినా స్పందనలేదు’అని ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్‌కె మట్టా వెల్లడించారు. కాగా జనవరి 4న విచారణ కీలకం కానుంది. బహుషా అదే మాల్యాకు ఆఖరి అవకాశం కోర్టు ప్రకటించే అకాశం ఉంది. అదే రోజు ప్రకటిత అపరాధిగా న్యాయస్థానం స్పష్టం చేయవచ్చని భావిస్తున్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయినా స్పందన కరవైంది. ఏప్రిల్ 12న ఆయనపై ఓపెన్-ఎండెడ్ ఎన్‌బీడబ్ల్యూ నోటీసులు కోర్టు జారీ చేసింది. గత ఏడాది 4న నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. పలు కేసుల్లో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావల్సి ఉంది. అయితే భారత్‌కు రావాలని ఉందని అయితే అధికారులు కస్టడీలో ఉన్న తన పాస్‌పోర్టును ఇప్పించాల్సిందిగా మాల్యా కోర్టును అభ్యర్థించారు. అలాగే జూలై 9న మాల్యాకు ఎలాంటి వ్యిక్తిగత మినహాయింపూ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. లండన్ పారిపోయిన ఆయన కోర్టుకు హాజరుకావల్సిందేనని సెప్టెంబర్ 9న న్యాయస్థానం ఆదేశించింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ రెగ్యులేషన్ చట్టం ఉల్లంఘించి ఆర్‌బీఐ అనుమతి లేకుండా నిధులు బదిలీ చేశారని ఈడీ ఆరోపిస్తోంది.