బిజినెస్

సరికొత్త స్థాయిలకు సూచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 22: క్రిస్మస్ పండుగ సమీపిస్తున్న వేళ శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో లావాదేవీలు ఉత్సాహపూరితంగా సాగి, కీలక సూచీలు రెండూ జీవిత కాల గరిష్ఠ స్థాయిలను తాకాయి. ఐటీ, టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్ షేర్లకు మదుపరుల నుంచి మంచి ఆదరణ లభించడంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 34,000 పాయింట్ల దరిదాపుల్లోకి చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 10,500 పాయింట్ల మైలురాయికి కాస్త దిగువన ముగిసింది. శుక్రవారం ఇంట్రా-డేలో ఈ రెండు సూచీలు కూడా జీవిత కాల గరిష్ఠ స్థాయిలకు ఎగబాకాయి. అమెరికాలో కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించేందుకు ఉద్దేశించిన పన్ను సంస్కరణల బిల్లు ఆమోదం పొందడంతో పాటు అమెరికా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) మూడో త్రైమాసికంలో దృఢమైన వృద్ధిని కనబరచడం ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ర్యాలీకి దారితీసింది. దీని ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ షేర్ల ధరలు పెరిగి, కీలక సూచీలు పైకి ఎగబాకాయి. నిఫ్టీ ఇంట్రా-డేలో జీవిత కాల గరిష్ఠ స్థాయి 10,500 పాయింట్లకు చేరింది. వచ్చే బడ్జెట్ బాగుంటుందని, ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో ఆదాయాలు బాగుంటాయనే అంచనాలు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లలో ర్యాలీ రావడానికి తోడ్పడ్డాయని నిపుణులు పేర్కొన్నారు.
బీఎస్‌ఈ సెనె్సక్స్ శుక్రవారం ఉదయం దృఢమైన స్థాయి 33,768.47 పాయింట్ల వద్ద ప్రారంభమయి, ఇంట్రా-డేలో 33,964.28 పాయింట్ల జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరింది. చివరకు 184.02 పాయింట్ల (0.55 శాతం) లాభంతో 33,940.30 పాయింట్ల వద్ద ముగిసింది. డిసెంబర్ 19న రికార్డు స్థాయిలో 10,463.20 పాయింట్ల వద్ద ముగిసిన సెనె్సక్స్ శుక్రవారం ఆ రికార్డును ఛేదించింది. ఈ సూచీ వరుసగా మూడో వారం పుంజుకుంది. ఈ వారంలో మొత్తం మీద 477.33 పాయింట్లు (1.42 శాతం) పెరిగింది. నిఫ్టీ ఈ వారంలో 159.75 పాయింట్లు (1.54 శాతం) పెరిగింది. టీసీఎస్‌కు పెద్ద ఆర్డర్ రావడంతో శుక్రవారం దాని నేతృత్వంలో ఐటీ షేర్లలో ర్యాలీ చోటు చేసుకుంది. చమురు ధరలు తక్కువగా ఉండటం, రూపాయి బలపడటం కూడా మార్కెట్ సెంటిమెంట్‌కు దోహదపడింది. నీతి ఆయోగ్ సవరించిన అంచనా ప్రకారం, 2012-17 మధ్య కాలంలో దేశంలో వౌలిక సౌకర్యాల రంగంలో పెట్టుబడులు రూ. 38,22,822 కోట్లు అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రకటించారు. 2007-12 మధ్య కాలంలోని పెట్టుబడులు రూ. 23,77,746 కోట్లతో పోలిస్తే, ఇది 1.6 రెట్లు ఎక్కువని ఆయన పేర్కొన్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మూడు నెలల గరిష్ఠ స్థాయికి బలపడడం కూడా స్టాక్ మార్కెట్‌కు దన్నుగా నిలిచింది. క్రిస్మస్‌ను పురస్కరించుకొని సోమవారం స్టాక్ మార్కె ట్లు పనిచేయవు. శుక్రవారం సెనె్సక్స్ ప్యాక్‌లోని ఓఎన్‌జీసీ అత్యధికంగా 2.87 శాతం లాభపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్ తరువాత స్థానాల్లో నిలిచాయి. బజాజ్ ఆటో, భారతి ఎయిర్‌టెల్, విప్రో, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ షేర్ల ధరలు 1.24 శాతం వరకు పెరిగాయి. ఐటీ సూచీ అత్యధికంగా 1.31 శాతం వరకు పెరిగింది.