బిజినెస్

ఏ బ్యాంకునూ మూసివేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ ముంబయి, డిసెంబర్ 22: ఏ ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)నూ మూసివేసే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) శుక్రవారం స్పష్టం చేశాయి. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను మూసివేసే అవకాశం ఉందని సోషల్ మీడియా సహా మీడియాలో సాగుతున్న ప్రచారం వదంతులు మాత్రమేనని పేర్కొన్నాయి. నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏ) భారంతో కుంగిపోతున్న పీఎస్‌బీ.. బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ)పై ఆర్‌బీఐ తక్షణ దిద్దుబాటు చర్యలు (పీసీఏ) తీసుకోవడంతో ప్రభుత్వం కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను మూసివేసే అవకాశం ఉందనే ప్రచారం మొదలయింది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియాపై తీసుకున్న తక్షణ దిద్దుబాటు చర్యలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లనే సామాజిక మాధ్యమం సహా కొన్ని వర్గాలకు చెందిన మీడియాలో కొన్ని బ్యాంకులను మూసివేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోందని ఆర్‌బీఐ ఆ ప్రకటనలో వివరించింది. ప్రభుత్వం కూడా ఈ ప్రచారాన్ని ఖండించింది. ‘ఏ ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకునూ మూసివేసే ప్రసక్తే లేదు. పైగా, ప్రభుత్వం రూ. 2.11 లక్షల కోట్ల పెట్టుబడుల పునరుద్ధరణతో ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేస్తోంది. వదంతులను నమ్మొద్దు. ప్రభుత్వ రంగ బ్యాంకులను పటిష్ఠం చేసేందుకు రీక్యాపిటలైజేషన్, సంస్కరణలకు సంబంధించిన రోడ్‌మ్యాప్ కొనసాగుతోంది’ అని కేంద్ర ఆర్థిక సర్వీసుల కార్యదర్శి రాజీవ్ కుమార్ శుక్రవారం సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు.