రాష్ట్రీయం

30 లక్షల హెక్టార్లలో కందిపప్పు సాగు: ఇక్రిసాట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: మార్కెట్‌లో కందిపప్పు ధరలు ఇంకా అదుపులోకిరాని నేపథ్యంలో 2018 నాటికి 30 లక్షలకుపైగా హెక్టార్లలో కందిసాగును చేపట్టాలనే లక్ష్యంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌సహా ఐదు రాష్ట్రాలు, ఇక్రిసాట్ ముందుకెళ్తున్నాయి. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఇక్రిసాట్ తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిషా రాష్ట్రాలకు చెందిన 40 మంది ప్రభుత్వ అధికారులు, ఈ రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు, ఎనిమిది విత్తన సంస్థల ఉన్నతోద్యోగులు హైబ్రిడ్ కందిపప్పు సాగు విస్తరణపై ఇక్రిసాట్ వద్ద జరిగిన చర్చలో పాల్గొన్నట్లు ఆ ప్రకటనలో ఇక్రిసాట్ తెలిపింది. ఈ క్రమంలోనే రెండేళ్లలో 30 లక్షలకుపైగా హెక్టార్లలో హైబ్రిడ్ కందిపప్పును ఉత్పత్తి చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు.