బిజినెస్

నాలుగేళ్ల కనిష్టానికి జీడీపీ వృద్ధి రేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం (2017-18)లో నాలుగేళ్ల కనిష్ట స్థాయి అయిన 6.5 శాతానికి దిగజారుతుందని అంచనా. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇంత తక్కువ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు పడిపోవడం ఇదే మొదటిసారి. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు పడిపోవడానికి ప్రధాన కారణాలు దేశ తయారీ రంగం (మానుఫాక్చరింగ్ సెక్టార్)పై కొత్తగా ప్రవేశపెట్టిన వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడమని సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్‌ఓ) శుక్రవారం విడుదల చేసిన జాతీయ గణాంకాల ముందస్తు అంచనాలలో వెల్లడించింది. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఏడు శాతం, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది శాతం ఉండింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతం ఉండింది. నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం 2014 మేలో ఏర్పడిన విషయం విదితమే. మానుఫాక్చరింగ్ సెక్టార్‌లో గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ) వృద్ధి రేటు కూడా ఈ ఆర్థిక సంవత్సరం 4.6 శాతానికి తగ్గుతుందని సీఎస్‌ఓ అంచనా వేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇది 7.9 శాతం నమోదయింది. సగటు వృద్ధి రేటుపై జీఎస్‌టీ ప్రభావం కొంత వరకు ఉందని చీఫ్ స్టాటిస్టీసియన్ టీసీఏ ఆనంద్ ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు బదులుగా చెప్పారు.