బిజినెస్

పనె్నండు దేశాలకు తపాలా పార్శిల్ సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 6: కేంద్ర ప్రభుత్వంతో ఎంవోయు కుదుర్చుకున్న 12 దేశాలకు ప్రతి పోస్ట్ఫాస్ నుంచి కూడా రూ.100 గ్రాముల నుంచి రెండు కిలోల వరకు ప్యాకింగ్‌తో కూడిన పార్శిల్స్‌ను పంపించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తిచేశామని తపాలాశాఖ విజయవాడ పోస్టల్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ కైరంకొండ సంతోష్ నేత తెలిపారు. అతి త్వరలోనే విజయవాడలో సబ్ ఫారిన్ పోస్ట్ఫాస్ ఏర్పాటు కాబోతున్నదని అన్నారు. ఈమేర ఆయన శనివారం నుంచి విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, కంబోడియా, న్యూజిలాండ్, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, ఫిలిఫ్పైన్స్, వియత్నాం దేశాలకు తొలి 100 గ్రాముల ప్యాకేజీకు రూ.310ల నుంచి రూ.330లు, ఆపై 2 కిలోల వరకు ప్రతి 100 గ్రాములకు రూ.25ల నుంచి రూ.45లు చొప్పున చార్జి నిర్ణయించామన్నారు. ట్రాకింగ్ విధానంలో ఈ పార్శిల్ ఎప్పుడు ఎక్కడకు చేరిందో ఇక్కడ నుంచే గమనించవచ్చన్నారు. ఒకేసారి ఎక్కువ పార్శిల్స్ పంపించేవారికి మొత్తం చార్జీలో రాయితీ లభిస్తుందన్నారు. ఈ సర్వీసును ప్రజలకు చేరువ చేసేందుకు ప్రత్యేకంగా స్థానిక చంద్రవౌళీపురం పోస్ట్ఫాస్‌లో ఒక ఇంటర్నేషనల్ బుకింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే పార్శిల్స్ పస్తుతం చెన్నైలోని ఫారిన్ పోస్ట్ఫాస్ ద్వారా డెలివరీ అవుతుండగా త్వరలోనే ఇక్కడ ఒక సబ్ ఫారిన్ పోస్ట్ఫాస్ ఏర్పాటు కానున్నదన్నారు. విదేశాలకు వెళ్లే ఈ పార్శిల్స్‌కు విధిగా మార్గమధ్యంలో కస్టమ్స్ క్లియరెన్స్ ఉంటుందన్నారు. అందుకే చట్టవ్యతిరేక ఫొటోగ్రాఫ్‌లు, ప్రింటింగ్ మెటీరియల్స్, లాటరీ ప్రకటనలు, పేలుడు పదార్ధాలు, మొక్కలు వంటివి నిషిద్ధమన్నారు. దశలవారీగా అన్ని పోస్ట్ఫాస్‌లలో మాతృభాష తెలుగు భాషలో కూడా బోర్డులు ఏర్పాటు చేయనున్నామని అన్నారు. రాష్ట్రంలో 28 డివిజన్లు ఉండగా విజయవాడ డివిజన్ పరిధిలో 82 సబ్ పోస్ట్ఫాస్‌లు, రెండు హెడ్ పోస్ట్ఫాస్‌లు, 287 బ్రాంచి పోస్ట్ఫాస్‌లు, రెండు వాణిజ్య కేంద్రాలు ఉన్నాయని అన్నారు. పోస్ట్‌కార్డుల ద్వారా కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా మటుమాయమైనప్పటికీ వాణిజ్యపరమైన కమ్యూనికేషన్ పెరిగిందని ఇందులో స్పీడ్ పోస్ట్ బీమా వసూళ్లు, మనియార్డర్ల స్థానంలో ఎలక్ట్రానిక్ మనియార్డర్లు పెరిగాయన్నారు. ఆపరేషన్, అడ్మినిస్ట్రేషన్ రెండింట పూర్తి కంప్యూటరైజేషన్ పెరిగిందని సంతోష్ నేత తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ పోస్ట్‌మాస్టర్ కె.కనకరత్నం, డిప్యూటీ పోస్ట్‌మాస్టర్ ఎస్.చంద్రశేఖర్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు, పీఆర్‌వో జి.రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.