బిజినెస్

పాడి రైతు చేయూతకు వినూత్న పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జనవరి 6: పాడి రైతును ఆదుకోవడంతో పాటు ప్రజలకు అవసరమైన పాల సరఫరా డిమాండ్‌ను అధిగమించేలా కొత్త పథకం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పదేపదే పాల ధరలు పడిపోతుండటం, డిమాండ్‌కు సరిపడ పాల ఉత్పత్తి, సరఫరా లేకపోవడంతో వినియోగదారులు, పాడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్‌లో పాలధరల స్థిరీకరణకు, పాల సరఫరా కొరతను అధిగమించేందుకు నూతన మార్గాలను అనే్వషిస్తున్న కేంద్రం అంగన్‌వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, రేషన్ దుకాణాల ద్వారా పాల పంపిణీ చేపట్టడంలో సాధ్యాసాధ్యాలకు కసరత్తు చేపట్టింది. ఈ దిశగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తన నూతన ప్రతిపాదనలను రాష్ట్రాలకు వివరించి ఇందుకు ముందుకు వస్తే పాల పంపిణీకి జరిగే ఖర్చును, ఇతరత్రా వౌలిక వసతుల కల్పనను అందిస్తామని రాష్ట్రాలకు భరోసానిస్తోంది. అలాగే పాల వినియోగం, డిమాండ్ పెరగడంతో పాటు పాల ధరలను స్థిరీకరించవచ్చని కేంద్రం చెబుతోంది.
పథకం పట్టాలెక్కితే ప్రయోజనాలే..!
మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, అంగన్‌వాడీ కేంద్రాలు, రేషన్ డీలర్ల ద్వారా పాల పంపిణీ జరిగితే బహుళ ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నారు. పాడిరైతులకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందించడంలో ఆర్థిక భారంతో వెనుకడుగు వేస్తుండటంతో పాడి పోషణ రైతులకు నష్టదాయకమవుతోంది. దీంతో అనేక ప్రభుత్వ డెయిరీలు పాల సేకరణలో ఆపసోపాలు పడుతున్నాయి. చివరకు అడిగిందే తడవుగా వరాలిచ్చే సీఎం కేసీఆర్ సైతం తెలంగాణలో నార్మాక్స్ డెయిరీ పాడి రైతులకు లీటర్‌కు నాలుగు రూపాయల ప్రోత్సాహకం అందిస్తామని చెప్పి గత సెప్టెంబర్ 14న ప్రకటించి నేటికీ అమలు ప్రారంభించలేదు. ప్రభు త్వం నుండి ప్రోత్సాహకం అందుతుందన్న ధీమాతో నార్మాక్ (మదర్ డెయిరీ) 37 రోజుల పాటు 1.85కోట్లు రైతులకు చెల్లించగా నేటికీ వారికి సదరు నిధులు ప్రభుత్వం నుండి అందకపోవడం సమస్యాత్మకంగా తయారైంది. ఈ డెయిరీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పరిధిలో 559 పాల సేకరణ కేంద్రాల ద్వారా రోజుకు 1.10లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. మద్దతు ధర కోసం పాడి రైతులు అనేక పర్యాయాలు ఆందోళన నిర్వహించినా ప్రయోజనం కరవైంది. ఈ తరహా డెయిరీలకు కేంద్రం ప్రతిపాదిస్తున్న నూతన పథకాన్ని రాష్ట్రాలు అమలు చేస్తే తద్వారా కేంద్రం నుండి అందే ఆర్థిక సహాయంతో పాడి రైతులకు ఊరటనిచ్చే కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టవచ్చు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, అంగన్‌వాడీలు, రేషన్ డీలర్ల ద్వారా పాల సరఫరా చేపడితే పట్టణాల్లో, గ్రామాల్లో పాల సరఫరా ప్రజలకు చేరువై ప్రజల పాల పాట్లకు పరిష్కారం లభించనుంది. అలాగే రేషన్ దుకాణాల ద్వారా సరఫరా జరిగే సబ్సిడీ వస్తువులు తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయ పని, ఆదాయ వనరులు వారికి దక్కే అవకాశముంది. ఇదే పద్ధతిలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బందికి కూడా అదనపు విధులు, ఆదాయమార్గాలు అందనున్నాయి. మధ్యాహ్న భోజన ఏజెన్సీలతో పాటు సమభావన మహిళా సంఘాల ద్వారా కూడా పాలసరఫరా చేయడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సివుంది. పనిలో పనిగా పౌష్టికాహార లోపాన్ని అధిగమించే క్రమంలో ఇప్పటికే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య లక్ష్మి వంటి పథకాలను మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దేందుకు అంగన్‌వాడీల్లో చిన్నారులకు పాలపంపిణీ కూడా చేస్తే వారి సంక్షేమం దిశగా ముందడుగు పడనుంది.