బిజినెస్

పోలవరం పవర్ హౌస్ ఏజెన్సీ ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 6: పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు జరిగిన పనులను పరిశీలిస్తే పవర్ హౌస్ నిర్మాణ ఏజెన్సీ ఖరారైంది. మొత్తం రూ. 5385.91 కోట్ల అంచనా వ్యయంతో పోలవరం హెడ్ వర్క్సు జరుగుతున్నాయి. 2012-13లో హెడ్ వర్క్సు రూ.4054 కోట్లతో చేపట్టారు. సవరించిన అంచనాల ప్రకారం ఇపుడు రూ. 5385.91 కోట్లకు చేరుకుంది. హెడ్ వర్క్సులో మెయిన్ డ్యామ్ ప్యాకేజీలో స్పిల్ వే నిర్మాణాలు, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్, ఎర్తెరన్ డ్యామ్స్, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్, 960 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ హౌస్ పునాది పనులు ఇమిడి వున్నాయి.
ఈ మొత్తం పనులకు సంబంధించి 1055.63 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని చేయాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు 802.57 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని పూర్తయింది. ఇంకా 253.06 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని జరుగుతోంది. అదే విధంగా మొత్తం కాంక్రీటు పనిని పరిశీలిస్తే 36.58279 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 4.260 లక్షల క్యూబిక్ మీటర్ల పని జరిగింది. అన్ని రకాల మట్టి పనికి సంబంధించి పరిశీలిస్తే రూ.181.81 కోట్ల విలువైన 76.03 శాతం మట్టి పని జరిగింది. ఇక స్పిల్ వేలో పునాది పని పూర్తయింది. మొత్తం మట్టి పని 165.449 లక్షల క్యూబిక్ మీటర్ల పని పూర్తయింది. స్పిల్ వే కాంక్రీటు పని జరుగుతోంది. 4.26 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పూర్తయింది. డ్యామ్ గేట్లకు సంబంధించి రూ.100 కోట్ల విలువైన పని పూర్తయింది. స్పిల్ వేకు సంబంధించి ఇప్పటి వరకు రూ. 612.81 కోట్ల విలువైన పని జరిగింది. ఎర్త్‌కం రాక్ ఫిల్ డ్యామ్‌కు సంబంధించి స్పిల్ ఛానల్, ఎప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్ మట్టి పనులు జరుగుతున్నాయి. 660 మీటర్ల డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయింది. 776 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనికి సంబంధించి ఇప్పటి వరకు 508.27 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని పూర్తయింది. ఇది 65.50 శాతం పూర్తయినట్టు. జూన్ 2018 నాటికి స్పిల్ ఛానల్ పూర్తి చేసేందుకు ప్రణాళిక నిర్దేశించారు. ఈ మొత్తం పనులకు సంబంధించి ఇప్పటి వరకు రూ. 980 కోట్ల విలువైన పని జరిగింది. ఈ మొత్తం పనులను పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ నిర్దేశించారు. అదే విధంగా పవర్ హౌస్‌కు సంబంధించి ఏజెన్సీ ఖరారైంది. పవర్‌హౌస్ పునాది మట్టి పనికి సంబంధించి మొత్తం 118 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనిచేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 96.01 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని జరిగింది. 21.99 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని జరుగుతోంది. ఇప్పటి వరకు రూ. 127 కోట్ల విలువైన పని జరిగింది. 2018 డిసెంబర్ కల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిర్దేశించారు.