బిజినెస్

సీలేరులో మరో జల విద్యుత్ కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, జనవరి 6: విశాఖ మన్యం, సీలేరులో మరో జల విద్యుత్ కేంద్రం నిర్మాణం కానుంది. ఇక్కడ ఎత్తిపోతల పథకం నిర్మించి, దీని ద్వారా వెయ్యి మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఇటీవల ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించామని జెన్‌కో హైడల్ డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం విలేఖరులతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి డొంకరాయి, సీలేరు రిజర్వాయర్లు అనుకూలంగా ఉండడంతో ఇక్కడ ఏర్పాటుకు ప్రతిపాదించామని, ఒక్కొక్క యూనిట్‌కు ఐదు కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకోసం సర్వే నిర్వహించామని, తదుపరి చర్యల కోసం సమగ్ర నివేదికను డీపీఆర్‌వోను ఏర్పాటు చేసి ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. అనంతరం కేంద్రం నుండి అటవీ శాఖ, పర్యావరణ పరిరక్షణ శాఖలు అనుమతులు రావాల్సి ఉందన్నారు. ఇందుకు నాలుగు నెలల సమయం పడుతుందని చెప్పారు. కాగా, 900 మెగావాట్ల సామర్థ్యంతో పోలవరంలో ప్రతిపాదించిన ప్రాజెక్టు నిర్మాణ పనుల టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, ఈ పనులు నవయుగ కన్‌స్ట్రక్షన్స్‌కు అప్పగించామని తెలిపారు. రాష్ట్రంలో ఏడు నుండి ఎనిమిదివేల మెగావాట్ల వరకు విద్యుత్‌కు డిమాండ్ ఉందని, విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్‌లో విద్యుత్ కొరత లేదని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో బింద్, సోలార్ విద్యుత్ కేంద్రాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. సోలార్ ద్వారా 1,800 మెగావాట్ల విద్యుత్, బింద్ ద్వారా నాలుగువేల మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు జల విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఎంతో అవసరం ఉందని వివరించారు. రాష్ట్రంలో కొత్తగా మరో రెండువేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేందుకు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, దీనిలో అనంతపురంలో 800 మెగావాట్లు, కడపలో 200 మెగా వాట్లు, కర్నూల్‌లో వెయ్యి మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు టెండర్లు పూర్తయ్యాయని నాగేశ్వరరావు పేర్కొన్నారు. కృష్ణా, సీలేరు బేస్‌ల్లో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయని, మార్చి 31 వరకు విద్యుత్ ఉత్పత్తికి ఢోకా లేదన్నారు. సీలేరు బేస్‌ల్లో 37 టీఎంసీలు నీటి నిల్వలు ఉన్నాయని, ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు గోదావరి డెల్టాకు కూడా సాగునీటిని అందిస్తామని ఆయన వివరించారు.
ఏవోబీలో మినీ హైడల్ ప్రాజెక్టులు
ఏవోబీలో ఉమ్మడి నిర్వహణలో మినీ జల విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు వేగవంతం చేస్తున్నామని హైడల్ డైరెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. 60 మెగావాట్ల సామర్థ్యం గల పవర్ హౌస్‌ను చిత్రకొండలో ఏర్పాటు చేయడానికి రెండు రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. మరో రెండు నెలల్లో పనులు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. మాచ్‌ఖండ్ రిజర్వాయర్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ జల విద్యుత్ కేంద్రం ద్వారా సామర్థ్యానికి మించిన విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. 2016లో 700 మెగావాట్లు, 2017లో 650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందన్నారు. విలేఖర్ల సమావేశంలో సోలార్ ప్రాజెక్టు ఎండీ ఆదిశేషు, సీఇలు మోహన్‌రావు, రత్నబాబు, ఎస్‌ఇలు రంగనాథన్, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ఎత్తిపోతల పథకానికి స్థల పరిశీలన చేస్తున్న అధికారులు