బిజినెస్

ఆర్థిక బంధం మరింత బలపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, జనవరి 6: ‘భద్రతలో, శ్రేయస్సులో భాగస్వామ్యం’ అనే సిద్ధాంతం ప్రాతిపదికగా ప్రాంతీయ వ్యవస్థ ఎదగాలన్నదే భారత్ ఆకాంక్ష అని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. ‘ఆసియాన్’ (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్)లోని ‘భారతీయ మేధో వ్యవస్థ’ అయిదవ రౌండ్ టేబుల్ సమావేశాన్ని శనివారం ఇక్కడ ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. సముద్ర భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంస్కృతిక వారసత్వం వంటి విషయాలపై దృష్టి సారించాలని ఆమె పిలుపునిచ్చారు. ‘కామర్స్, కనెక్టివిటీ, కల్చర్’ అనే మూడు అంశాలకు ఆసియాన్ సభ్య దేశాలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పరిపక్వత, బాధ్యత అనే లక్షణాలను పుణికిపుచ్చుకున్న భారతీయ విదేశాంగ విధానం మేలైన ప్రాంతీయ వ్యవస్థ ఏర్పాటుకు దోహదం చేస్తుందన్నారు. భద్రతలో, శ్రేయస్సులో భాగస్వామ్యం వల్లే వివిధ దేశాల మధ్య బంధాలు బలపడతాయన్నారు. ఈ బంధాల్లో ఆర్థిక బంధం అత్యంత అవసరమన్నారు.
ఇండో పసిఫిక్ ప్రాంతం వివిధ దేశాలను కలిపే రాచమార్గంగా మారుతోందని, ప్రపంచంలో చాలావరకూ వాణిజ్యం ఈ ప్రాంత సముద్రాల ద్వారా జరుగుతోందని సుష్మా వివరించారు. ఈ సముద్రాలు వివిధ దేశాల మధ్య బంధాన్ని పెంచడానికే కాదు, భయాలను, బెదిరింపులను సైతం తొలగించేలా ఉండాలన్నారు. ప్రజలు, వస్తువులు, ఆలోచనలు స్వేచ్ఛగా సంచరించేలా ఈ ప్రాంతంలోని సముద్రాలు మారాలన్నారు. ఆర్థిక రంగం, తీరంలో నిఘా, సమాచార మార్పిడి, సముద్ర భద్రతపై అప్రమత్తత వంటి విషయాల్లో ఆసియాన్ దేశాలు పరస్పరం సహకరించుకోవాలన్నారు. తమ దేశపు ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో ఆసియాన్ ప్రాంత అభివృద్ధి ఒక భాగమని సుష్మ అన్నారు. భారత్‌కు సంబంధించి ‘ఆసియాన్’ నాలుగవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని, భారతీయ వాణిజ్యంలో 10.2 శాతం వ్యాపారం ఆసియాన్ దేశాలతో ముడిపడి ఉందన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల పురోగతికి మరింత కృషి జరగాలన్నారు. మేధావులు, నిపుణులు, విద్యావేత్తలు కొత్త ఆలోచనలను అందజేయాలని ఆమె పిలుపునిచ్చారు. కాగా, ఆసియాన్ సెక్రటరీ జనరల్ డాటో పడుకా లిమ్‌తో ఆమె చర్చలు జరిపారు. ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో భాగంగా ఆసియాన్ దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామన్నారు. ఆసియాన్ దేశాల ప్రతినిధులతో ఈనెల 25న న్యూఢిల్లీలో ఓ సదస్సును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.