బిజినెస్

పోర్టులకు ఇక రెట్టింపు లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, జనవరి 6: భారతీయ పోర్టులు ఈ ఏడాది ఏడువేల కోట్ల రూపాయల మేరకు లాభాలను ఆర్జించే పరిస్థితి ఉందని రహదారులు, షిప్పింగ్ శాఖల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ‘ఆసియాన్- ఇండియా ప్రవాసీ భారతీయ దివస్’ సందర్భంగా శనివారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెట్టుబడులకు తగ్గ లాభాలను పొందేలా భారత్‌లో ఎన్నో ప్రాజెక్టులున్నాయని, వాణిజ్య రంగంలో వినూత్న కార్యక్రమాలు చేపట్టేందుకు ఎన్నో అవకాశాలున్నాయని వివరించారు. ఈ ఏడాది భారత్‌లోని అన్ని పోర్టులూ లాభాలను ఆర్జించే వీలుందన్నారు. గత ఏడాది పోర్టులకు 3,000 కోట్ల రూపాయల ఆదాయం రాగా, ఈ ఏడాది అది రెట్టింపు అవుతుందన్నారు. ఆరు కొత్త పోర్టులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. భారత్‌లో వ్యాపారాభివృద్ధికి ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని సదస్సులో పాల్గొన్న వారికి గడ్కరీ విజ్ఞప్తిచేశారు. ముఖ్యంగా వౌలిక వనరుల ఏర్పాటుకు పరిశ్రమలు స్థాపించాలని ఆయన ‘ఆసియాన్’లోని మదుపరులను కోరారు. మూడేళ్ల క్రితం రోజుకు 28 కిలోమీటర్ల మేరకు రహదారులు నిర్మించే పరిస్థితి ఉండగా, ఇపుడు రోజుకు 40 కిలోమీటర్ల మేరకు రోడ్లు వేసే సామర్ధ్యం పెరిగిందన్నారు. మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ దేశాలకు రహదారుల నిర్మాణం పనులు 60 నుంచి 70 శాతం మేరకు పూర్తయ్యాయని వివరించారు. ముంబయిలోని ప్రత్యేక ఆర్థిక మండలిలో కార్యాకలాపాలు ప్రారంభించేందుకు 40 సంస్థలు ఆసక్తి చూపాయన్నారు. తైవాన్ సంస్థ 6వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిందన్నారు. భారత్‌లోని ‘గంగ ప్రక్షాళన ప్రాజెక్టు’కు విదేశాల్లోని భారతీయులు విరాళాలివ్వాలని ఆయన కోరారు. లండన్‌కు చెందిన ఓ సంస్థ గంగానదీ ప్రక్షాళన పనులకు 3,000 కోట్ల రూపాయల మేరకు ఆర్థిక సహాయం చేసిందని గడ్కరీ వెల్లడించారు.