బిజినెస్

ఐదో వారమూ పుంజుకున్న సూచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 6: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా అయిదో వారం పుంజుకున్నాయి. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో మార్కెట్ కీలక సూచీలు జీవితకాల గరిష్ఠ స్థాయిల వద్ద ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ కీలకమైన 34వేల స్థాయికి పైన 34,153.85 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా సరికొత్త గరిష్ఠ స్థాయి 10,558.85 పాయింట్ల వద్ద ముగిసింది. కొత్త సంవత్సరం 2018లో దేశీయ స్టాక్ మార్కెట్లు తక్కువ స్థాయిల వద్దనే ప్రారంభమయ్యాయి. దాదాపు ఫ్లాట్‌గానే కొనసాగాయి. అయితే వారం ముగింపునకు వస్తున్న కొద్దీ పుంజుకున్నాయి. దేశ ఆర్థిక వృద్ధి రేటు పడిపోతుందనే ఆందోళన నెలకొనడం, ముడి చమురు ధరలు పెరగడానికి తోడు కార్పొరేట్ కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలు వెలువడనుండటం వల్ల ఈ వారం తొలి మూడు సెషన్లలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో కీలక సూచీలు పెద్దగా ఎదుగూబొదుగూ లేకుండా ఉండిపోయాయి. నిరర్ధక ఆస్తుల భారంతో కుంగిపోతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదుకోవడానికి ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ అమలులో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయడంతో పాటు డిసెంబర్ నెలలో సేవారంగ పీఎంఐ గణాంకాలు పుంజుకోవడం, ప్రపంచ మార్కెట్లలో షేర్ల ధరలు పెరగడం వంటి కారణాలతో దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు), విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐలు) రంగంలోకి దిగి షేర్ల కొనుగోలుకు పూనుకున్నారు.
సెనె్సక్స్ ఈ వారం గరిష్ఠ స్థాయి 34,059.99 పాయింట్ల వద్ద ప్రారంభమై, కొత్త గరిష్ఠ స్థాయి 34,188.85- కనిష్ట స్థాయి 33,703.37 పాయింట్ల మధ్య కదలాడి, చివరకు వారం రికార్డు గరిష్ఠ స్థాయి 34,153.85 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తంమీద ఈ వారంలో 97.02 పాయింట్లు (0.28 శాతం) పెరిగింది. ఈ సూచీ క్రితం వారం 1,584.69 పాయింట్లు (4.82 శాతం) పుంజుకున్న విషయం విదితమే. నిఫ్టీ కూడా ఈ వారం అధిక స్థాయి 10,531.70 పాయింట్ల వద్ద ప్రారంభమయి, సరికొత్త గరిష్ఠ స్థాయి 10,566.10, కనిష్ట స్థాయి 10,404.65 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు రికార్డు గరిష్ఠ స్థాయి 10,558.85 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ ఈ వారం మొత్తం మీద కలిపి 28.15 పాయింట్లు (0.27 శాతం) పెరిగింది. ఈ వారంలో మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ప్రైవేటు బ్యాంకుల షేర్లతో పాటు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్ల ధరలు పెరిగాయి. డిసెంబర్ నెలలో వాహనాల అమ్మకాలు పెరిగినప్పటికీ, వాహన కంపెనీల షేర్ల ధరలు ఈ వారంలో పడిపోయాయి. క్యాపిటల్ గూడ్స్, ఐపీఓలు, పవర్, ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు), స్థిరాస్తి, బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్ల కొనుగోలుకు మదుపరులు ఆసక్తి కనబరిచారు. చమురు - సహజ వాయువు, వాహన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజి (ఐటీ), టెక్నాలజీ షేర్లలో మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో వాటి ధరలు తగ్గిపోయాయి.
ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు), విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐలు) కలిపి ఈ వారంలో నికరంగా రూ. 1,666.84 కోట్ల విలువ గల షేర్లను కొనుగోలు చేశారు. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ మిడ్-క్యాప్ సూచీ ఈ వారం 247.63 పాయింట్లు (1.39 శాతం) పుంజుకొని, 18,070.03 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ స్మాల్-క్యాప్ సూచీ 474.20 పాయింట్లు (2.47 శాతం) పుంజుకొని, 19,704.92 పాయింట్ల వద్ద ముగిసింది. రంగాలు, ఇండస్ట్రీ సూచీలలో మెటల్ 4.76 శాతం పుంజుకుంది. కన్జ్యూమర్ డ్యూరేబుల్స్ 4.66 శాతం, క్యాపిటల్ గూడ్స్ 3.93 శాతం, ఐపీఓ 2.89 శాతం, పవర్ 2.00 శాతం, పీఎస్‌యూ 0.80 శాతం, హెల్త్‌కేర్ 0.75 శాతం, రియాల్టీ 0.43 శాతం, బ్యాంకెక్స్ 0.28 శాతం చొప్పున పెరిగాయి. అయితే చమురు- సహజ వాయువు 0.76 శాతం, ఆటో 0.75 శాతం, ఐటీ 0.73, టెక్ 0.17 శాతం చొప్పున పడిపోయాయి.