బిజినెస్

సింగరేణి విస్తరణకు రూ.10వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్) వచ్చే ఐదేళ్లలో 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు పథక రచన చేసింది. ఉన్నతవర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం వచ్చే ఐదేళ్లలో సంస్థ ఆదాయం 34 వేల కోట్ల రూపాయలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆదాయం 24 వేల కోట్ల రూపాయలని వివరించారు. ఎస్‌సిసిఎల్ అధీనంలో ఉన్న థర్మల్ విద్యుత్ పవర్‌ప్లాంట్ సామర్థ్యం 1200 మెగావాట్లు కాగా, మరో 500 మెగావాట్లు అదనంగా చేర్చేందుకు నిర్ణయించారు. వచ్చే ఏడాది నుండి విస్తరణ పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. మరో 500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ పవర్‌ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. 2022 సంవత్సరం కల్లా తమ సంస్థ పరిధిలో 2500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించామన్నారు. కొత్తగా 12 కొత్త బొగ్గుగనులను ప్రారంభించేందుకు వీలుగా కేంద్రానికి లేఖరాశామని, కేంద్రం అనుమతి రాగానే గనుల తవ్వకం ప్రారంభిస్తామన్నారు. ఈ మొత్తానికి 10వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనావేశారు. అంటే ఏటా రెండువేల కోట్ల రూపాయలు పెట్టుబడిగా అవసరం అవుతాయని ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం ఎస్‌సిసిఎల్ వద్ద ఆరువేల కోట్ల రూపాయల నిలువలున్నాయని సంబంధిత ఉన్నతాధికారి తెలిపారు. గత ఆర్థికసంవత్సరంలో 400 కోట్ల రూపాయలు లాభం రాగా, ఈ ఆర్థిక సంవత్సరం 1100 కోట్ల రూపాయల లాభాలు వస్తాయని భావిస్తున్నామన్నారు. బొగ్గు అమ్మకాలు టన్నుకు సరాసరిన 2500 రూపాయలు వస్తున్నాయని తెలిపారు. సంస్థను లాభాల వైపుతీసుకువెళ్లేందుకు కార్మికులు పూర్తిగా సహకారం అందిస్తున్నాని ఆ అధికారి తెలిపారు.