బిజినెస్

కార్పొరేట్ ఆదాయాలపైనే మార్కెట్ భవిత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 7: సోమవారం మొదలయ్యే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో లావాదేవీల సరళి స్థూల ఆర్థిక గణాంకాలతో పాటు డిసెంబర్ నెలతో ముగిసిన మూడో త్రైమాసికంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్‌లు చూపిన పనితీరుపై ఆధారపడి ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
నవంబర్ నెల పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ), డిసెంబర్ నెల వినియోగ వస్తువుల ధరల సూచీ (సీపీఐ) వంటి ముఖ్యమైన స్థూలార్థిక గణాంకాలు ఈ నెల 12వ తేదీన వెలువడనున్నాయని, ఈ గణాంకాలు దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయని ప్రైవేటు క్లయింట్ గ్రూపు, క్యాపిటల్ మార్కెట్ స్ట్రాటజి హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ అధిపతి వీకే శర్మ పేర్కొన్నారు. ‘కార్పొరేట్ కంపెనీల మూడో త్రైమాసిక ఆదాయాలు బాగుంటాయని, ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా ఉంటాయనే అంచనా కారణంగా స్టాక్ మార్కెట్లలోకి తగినంత పెట్టుబడులు రావడం వల్ల మార్కెట్‌లో లావాదేవీలు అధిక ధరల వద్ద జరుగుతున్నాయి. అయితే బడ్జెట్ సంబంధిత మరిన్ని సానుకూల అంశాలు, కార్పొరేట్ కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలపై మార్కెట్ సమీప భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ విభాగం అధిపతి వినోద్ నాయర్ విశే్లషించారు. కొత్త సంవత్సరం 2018 తొలి వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 97.02 పాయింట్లు (0.28) శాతం పుంజుకోగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 28.15 పాయింట్లు (0.26 శాతం) పుంజుకుంది. ‘మూడో త్రైమాసిక ఫలితాలు వెలువడనుండటంతో అందరి కళ్లూ ఐటీ రంగానికి చెందిన టీసీఎస్, ఇన్ఫోసిస్‌లపై, వాటి మార్గదర్శకత్వంపై ఉన్నాయి’ అని ఎపిక్ రీసెర్చ్ కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) ముస్త్ఫా నదీమ్ తెలిపారు.