బిజినెస్

పారదర్శకతను పెంపొందించడానికే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 7: ప్రస్తుత ఎన్నికల విరాళాల వ్యవస్థతో పోలిస్తే ప్రభుత్వం తీసుకొస్తున్న ఎన్నికల బాండ్ల విధానం వల్ల పారదర్శకత గణనీయంగా పెరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. రాజకీయ విరాళాలను ప్రక్షాళన చేయడానికి వివిధ వర్గాల సూచనలు, సలహాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ఆదివారం సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న సంప్రదాయ రాజకీయ విరాళాల విధానంలో రాజకీయ పార్టీలు విరాళాలను నగదు రూపంలో తీసుకోవడం, నగదు రూపంలో వ్యయం చేయడం వల్ల ఆ విరాళాలు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయో మూలాలు తెలియడం లేదని జైట్లీ పేర్కొన్నారు. కొన్ని సందర్భాలలో మారు పేర్లతో రాజకీయ పార్టీలకు విరాళాలు అందుతున్నాయని ఆయన తెలిపారు. ఎంత మొత్తంలో విరాళాలు అందాయనేది ఎప్పటికీ వెల్లడి కావడం లేదని పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు, సంస్థల నుంచి అక్రమ నిధులు రాజకీయ పార్టీలకు విరాళాల రూపంలో చేరడానికి ఈ సంప్రదాయ విధానం దోహదపడుతోందని జైట్లీ పేర్కొన్నారు. ఈ సంప్రదాయ రాజకీయ విరాళాల వ్యవస్థ ఏమాత్రం పారదర్శకంగా లేదని ఆయన పేర్కొన్నారు. అందువల్లే దీనిని ప్రక్షాళన చేయడానికి ప్రత్యామ్నాయంగా ఎన్నికల బాండ్ల విధానాన్ని తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. జైట్లీ గత వారం ఎన్నికల బాండ్ల విధానాన్ని ప్రకటించిన విషయం విదితమే. దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఈ ఎన్నికల బాండ్లను విక్రయిస్తుంది. ఈ ఎన్నికల బాండ్లను పక్షం రోజుల్లోగా నగదుగా మార్చుకోవాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలకు వ్యక్తులు, సంస్థలు నగదు రూపంలో విరాళాలు అందజేయడానికి బదులుగా ఈ ఎన్నికల బాండ్ల రూపంలో ఇవ్వడానికి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు.