బిజినెస్

ధరల పెంపుపై ఫిబ్రవరిలో ప్రజాభిప్రాయ సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 8: విద్యుత్ ఉత్పాదక రంగాన్ని వెంటాడుతూ వస్తున్న నష్టాల ఊబి నుంచి బయటపడేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యుత్ సరఫరా చార్జీల పెంపుదలపై ఫిబ్రవరి 5తేదీ నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుపనున్నామని విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ గ్రంధి భవానీప్రసాద్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించే అవకాశాలు లేనందున విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతి నగరాల్లో నిర్ణీత తేదీలు, నిర్ణీత సమయాల్లో అన్ని వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ జరుపుతామని అన్నారు. స్థానిక గుణదల విద్యుత్ సౌధలో సోమవారం విద్యుత్ తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ మండళ్ల అధికారులతో సమావేశమై 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఏమేర విద్యుత్ వినియోగం ఉండగలదో వివరంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటైన విలేఖరుల సమావేశంలో జస్టిస్ భవానీప్రసాద్ మాట్లాడారు. తమ సంస్థ పనితీరుపై కూడా ఇదే సమయంలో ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘ఉదయ్’ పథకం అమల్లో రాష్ట్రంలోని ఈ రెండు ప్రాంతీయ మండళ్లు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయని అన్నారు. వివిధ సంస్కరణల వల్ల గడచిన మూడేళ్లలో విద్యుత్ కొనుగోలు ఖర్చులను గణనీయంగా తగ్గించగల్గామన్నారు. విద్యుత్ యూనిట్ ఉత్పత్తి వ్యయం 4-50 పైసల నుంచి 4-10 పైసలకు, అలాగే స్వల్పకాలిక కొనుగోళ్ల రేటును రూ.6-50 పైసలును 5-50 పైసలకు తగ్గించగల్గామన్నారు. 2014లో 96 శాతం మంది, 2015లో 95 శాతం మంది వినియోగదారులపై భారం లేకుండా చేశామన్నారు. 2017లో టారిఫ్ పెరగలేదన్నారు. 2018-19లో కూడా ఎలాంటి అదనపు భారం పడబోదని నర్మగర్భంగా చెప్పారు. అయితే ఉత్పత్తి వ్యయం నష్టాలను సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరించాల్సి ఉంటుందన్నారు. సీఎం చంద్రబాబు కూడా టారిఫ్ పెంచబోమని ఇప్పటికే ప్రకటించిన విషయం పాఠకులకు విదితమే.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న జస్టిస్ భవానీప్రసాద్