బిజినెస్

చిన్న పరిశ్రమలతోనే పెద్ద ఉపాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 8: దేశంలో సూక్ష్మ,చిన్న,మధ్య తరహా పారిశ్రామిక రంగంలోనే అత్యధిక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనల శాఖ సహాయ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ అన్నారు. సెంటర్ ఫర్ భారతీయ మేనేజ్‌మెంట్ బోర్డు (సీబీఎండీ) ఆధ్వర్యంలో విశాఖలో జరుగుతున్న హస్తకళల ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అందరికీ ఉద్యోగాలు కల్పించడం అసాధ్యమేనని, అయితే అందరికీ ఉపాధి కల్పించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మన దేశంలోనే యువత ఎక్కువగా ఉందని, వీరంతా ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం తయారీ రంగం, గ్రామీణ, దేశీయ పరిశ్రమల ద్వారా ఉపాధికి మెరుగైన పథకాలు మొదలయ్యాయన్నారు. సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పారిశ్రామిక రంగం బలోపేతం కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశంలో 40 కోట్ల మంది జనాభా అసంఘటిత రంగంలో ఉన్నారని, వీరందరికీ కార్మిక సంక్షేమ ఫలాలు అందించేలా కేంద్రం ఆయా రంగాల్ని పటిష్టం చేస్తోందన్నారు. జనధన్ యోజన, ముద్ర యోజన వంటి పథకాల ద్వారా ఇప్పటి వరకూ 9 కోట్ల ఖాతాలకు రూ.4లక్షల కోట్ల రుణాలు పంపిణీ చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ ఎగ్జిబిషన్‌లో ప్రభుత్వ సహకారంతో రుణాలు పొందిన వారు తయారు చేసినవేనన్నారు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం నాలుగు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు వేతనాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సదుపాయాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గాంధీ, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ వంటి నేతలు గ్రామీణాభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమని అభిప్రాయపడ్డారని, మోదీ ప్రభుత్వం ఆదిశగా గ్రామీణ ఉపాధికి పెద్ద పీట వేస్తోందన్నారు.

చిత్రం..హస్తకళ మేళా ముగింపు సభలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్