బిజినెస్

రాజమహేంద్రవరం నుంచి.. నేరుగా బెంగళూరు, చెన్నైకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 9: రాష్ట్రంలో ప్రముఖ విమానాశ్రయంగా విస్తరిస్తోన్న రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి నేరుగా బెంగళూరు, చెన్నై వెళ్లడానికి సర్వీసులు మొదలయ్యాయి. మంగళవారం నుంచి ఇండిగో సంస్థ తన సర్వీసులను రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుండి ప్రారంభించింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకు ఈ సర్వీసులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఇండిగో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎం సంజీవ్ రామదాస్ జెండా ఊపి విమాన సర్వీసులను ప్రారంభించారు. రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ మీదుగా చెన్నైకు, బెంగళూరుకు రెండేసి సర్వీసులు, హైదరాబాద్‌కు ఒకటి సర్వీసులు నడుస్తాయి. ఇప్పటి వరకు రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి ట్రూజెట్, జెట్ ఎయిర్‌వేస్, స్పైస్ జెట్ సంస్థలు సేవలు అందిస్తున్నాయి. ఇపుడు ఇండిగో సంస్థ కూడా రంగంలోకి దిగడంతో కొత్తగా మరో నాలుగు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. వెరసి ఎనిమిది విమానాలు రాను, పోను సర్వీసులను నిర్వహించనున్నాయి. దీనికి తోడు ప్రత్యేక కార్గొ కూడా ఈ ఎయిర్‌పోర్టు నుంచి నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోనే ప్రసిద్ధి చెందిన కడియం నర్సరీ సమీపంలోనే ఉండటంతో పాటు ఓఎన్జీసీ, గెయిల్, జీఎస్పీసీ వంటి సంస్థలు కేజీ బేసిన్‌లో కార్యకలాపాలు విస్తరించడంతో ఈ ఎయిర్‌పోర్టు బహుముఖంగా దోహదపడుతోంది. ఒకవైపు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, ఫ్లోరీ కల్చర్, ఉద్యాన పంటల ఎగుమతులు, చేపలు, రొయ్యలు వంటి ఉత్పత్తుల ఎగుమతులకు ఈ విమానాశ్రయం దోహదపడే విధంగా రన్‌వేను విస్తరిస్తున్నారు.