బిజినెస్

అనుకున్నంత ఈజీ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 9: చదువు పూరె్తైన తరువాత ఉద్యోగమే పరమార్థం అనుకునేవారికి వాస్తవికంగా ఎదురయ్యే సవాళ్లు మింగుడుపడనివిగా ఉన్నాయని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో స్పష్టమైంది. కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకునేవారికి అనేక ఆశలు, కోరికలు ఉంటాయి. గంటల తరబడి అదేపనిగా పనిచేసే పరిస్థితి ఉండకూడదని, అలాగే ఎప్పుడుబడితే అవసరానుగుణంగా మార్పులు చేసుకునే అవకాశమూ ఉండాలని, అన్నింటికీ మించి తమ పనికి తగ్గ జీతభత్యాలు ఉండాలని కొత్తగా ఉద్యోగంలో చేరేవారు ఆశించడం సహజం. కానీ, ఇందుకు భిన్నమైన పరిస్థితులే వీరికి ఎదురవుతున్నాయన్న విషయం ఈ సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా 18-34ఏళ్ల మధ్య వయస్కులు తమ విధులకు సంబంధించిన సవాళ్ల విషయంలో లోతైన అవగాహనను కలిగి ఉండాలని, వాటిని ఏవిధంగా ఎదుర్కోవాలన్న దానిపైనా వీరు ముందుగానే సిద్ధం కావాల్సిన అవసరమూ ఉందని ఈ సర్వే తెలిపింది. తొలి ఉద్యోగం అన్నది ఏ వ్యక్తికైనా మరచిపోలేని అనుభూతి, ఆనందాన్ని అందిస్తుంది. ఇలా తొలిసారిగా ఉద్యోగాల్లో అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ కూడా పరిస్థితులు తమకు అనుకూలంగా ఉండాలన్న బలమైన ఆశతో ఉన్నారని, తమను రాపాడించే రీతిలో పనివేళలు ఉండకూడదన్న భావన కూడా వీరిలో స్పష్టంగా కనిపించిందని ఈ సర్వే వెల్లడించింది. అలాగే, ఈ తొలిసారి ఉద్యోగంలో చేరిన యువత అనేక రకాలుగా అసంతృప్తితో ఉన్నట్టుగా కూడా ఈ సర్వే స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా ఇదే తొలి ఉద్యోగం కాబట్టి దాని నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు, సవాళ్ల విషయంలో తమకు ఏరకమైన అవగాహనా లేకుండా పోతోందన్న భావన కూడా వీరిలో కనిపించింది. అంటే, పనికి తగ్గ సామర్థ్యం, సమర్థత, మానసిక స్థయిర్యం, ఒడిదుడుకులను తట్టుకోగలిగే నిలకడ తనంవంటివి వీరిలో ఆశించిన స్థాయిలో లేవని ఈ సర్వే వెల్లడించింది. అందుకే దాదాపు 60శాతం మంది తమ తొలి ఉద్యోగాలకు మధ్యలోనే వదిలేసిన దాఖలాలు కోకొల్లలుగా ఉన్నాయని, ఉద్యోగం కంటే కూడా ఏదో వృత్తిని ఎంచుకుని అందులో నైపుణ్యాన్ని సంపాదించుకోవడం ద్వారా స్థిరమైన, నమ్మకమైన ఆదాయాన్ని పొందవచ్చన్న ఆలోచన కూడా వీరిలో కనిపిస్తోందని ఈ సర్వే తెలిపింది. అందరూ వృత్తులనే ఎంచుకునే అవకాశం లేకపోయినా, ఉన్న ఉద్యోగంకంటే మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకోవాలన్న తపన కూడా వీరిలో మెండుగానే కనిపిస్తోందని ఈ సర్వే తెలిపింది. దాదాపు ఐదువేల మంది యువతీ యువకుల తొలి ఉద్యోగ అనుభవాలను తెలుసుకోవడంలో భాగంగా ఈ సర్వే నిర్వహించారు. తొలి ఉద్యోగం కాబట్టి అందులోనే స్థిరపడిపోవాలన్న పట్టుదలగాని, ఆరాటంగాని నేటి యువతీ యువకల్లో లేదని, తమకు నచ్చని ఏ ఉద్యోగాన్నైనా వదిలిపెట్టి, నచ్చిన ఉద్యోగం కష్టమైనా అందులో రాణించాలన్న పట్టుదల వీరిలో మెండుగా ఉందని ఈ సర్వే తెలిపింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారిలో 29శాతం మంది ఏడాది తిరగకుండానే వాటికి స్వస్తి పలికి తమ ఆలోచనలకు అనుగుణమైన సరికొత్త బాటలో పయనించిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయని సర్వే తెలిపింది. 80శాతం మంది ఈ తొలి ఉద్యోగస్తులు ఈ సర్వేలో పాల్గొని తాము ఎదుర్కొన్న పరిస్థితుల గురించి, తొలి ఉద్యోగం వదలిపెట్టడానికి కారణాల గురించి, ఉద్యోగం అంటే ఏమిటి? అది ఎలా ఉండాలన్న దానిపైనా స్థిరమైన అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు సర్వే తెలిపింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 22 శాతం మంది పనివేళలు అధికంగా ఉన్నాయని, ఏవిధంగానూ మార్పులకు ఆస్కారం లేని పరిస్థితుల్లో తాము పని చేయాల్సి వచ్చిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే మరో 15శాతం మంది మాత్రం తాము పనికి తగ్గట్టుగా మెరుగైన జీతభత్యాలు ఉండివుంటే బావుండేదని అభిప్రాయపడితే, మరో 15 శాతం మంది తమ బాస్‌తో వేగలేకే తొలి ఉద్యోగాన్ని వదలుకోవాల్సి వచ్చిందన్న ఆవేదనను వ్యక్తం చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువతీ యువకులను తీర్చిదిద్దడంతోపాటు నేటి పరిస్థితుల్లో భిన్న రీతుల్లో అందుబాటులోవున్న ఉపాధి అవకాశాల విషయంలో వారికి తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరాన్నీ ఈ సర్వే స్పష్టం చేసింది. నైపుణ్యంతోపాటు వాస్తవిక పరిస్థితులను సైతం కళ్లకుకట్టే రీతిలో యువతీ యువకులను సుశిక్షితులను చేయగలిగినపుడే ఉపాధైనా, ఉద్యోగమైనా వారికి సంతృప్తి ఇవ్వగలుగుతుందన్న అభిప్రాయాన్ని ఈ సర్వే నిర్వహించిన మాన్‌స్టర్ డాట్ కామ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ మోది వెల్లడించారు.