బిజినెస్

ధరలు పెంచిన కోల్ ఇండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 9: ప్రభుత్వరంగంలోని కోల్ ఇండియా కంపెనీ తక్షణమే అమల్లోకి వచ్చేవిధంగా ఇంధన, ఇంధనేతర వినియోగదారులకు వర్తించే రీతిలో థర్మల్ బొగ్గు ధరలను భారీగానే పెంచింది. దీని ప్రభావం వల్ల విద్యుత్ రేట్లను పెంచక తప్పని పరిస్థితి ఎదురవుతుందని ఉత్పత్తిదారులు స్పష్టం చేశారు. యూనిట్‌కు 0.50 శాతంమేర విద్యుత్ రేట్లు పెంపు అనివార్యమవుతుందన్న అభిప్రాయాన్ని ఉత్పత్తిదారులు వ్యక్తం చేశారు. కాగా కోల్ ఇండియా తీసుకునే ఈ నిర్ణయం వల్ల థర్మల్ బొగ్గు ధరలు పదిహేను నుంచి 20శాతం మేర ఆయా గ్రేడులను బట్టి పెరిగే అవకాశం ఉంటుందని క్యాప్టివ్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. దీనివల్ల యూనిట్ ధర 0.30 -0.50 మేర పెరిగే అవకాశం ఉందని తెలిపింది. జనవరి 9నుంచి అమల్లోకి వచ్చే విధంగా బొగ్గు ధరలను పెంచుతూ కోల్ ఇండియా బోర్డు నిర్ణయించింది. అయితే, ఈ పెంపుదల ఏమేరకు ఉంటుందనే దానిపై ఎలాంటి సంకేతాలు అందించలేదు. ఈ పెరుగుదల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలంలో అదనంగా 1956 కోట్ల రూపాయల మేర ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అలాగే మొత్తం రెవిన్యూ 6421 కోట్ల రూపాయల మేర ఉండొచ్చన్న సంకేతాలూ వ్యక్తమవుతున్నాయి. ఎన్‌ఇసి సహా కోల్ ఇండియా అనుబంధ సంస్థలన్నింటికీ ఈ ధరల పెంపుదల వర్తిస్తుందని బిఎస్సీలో దాఖల చేసిన నివేదికలో బోర్డు తెలిపింది. ఎంతమేరకు ధరలు పెంచిన విషయాన్ని వెల్లడించకపోయినా, కచ్చితంగా దీని ప్రభావం విద్యుత్ ధరలపై ఉంటుందన్న అభిప్రాయాన్ని ఇంధన ఉత్పత్తిదారులు వ్యక్తం చేశారు.