బిజినెస్

కొనసాగుతున్న బుల్ రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 9: భారత స్టాక్‌మార్కెట్లు అనూహ్యంగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల ఊతంతో వరుసగా మూడోరోజు కూడా భారీగానే రాణించాయి. సమాచార టెక్నాలజీ, ఎఫ్‌ఎంసిజి, చమురు వాయువు, ఇంధన రంగాలకు చెందిన షేర్లు భారీగా పుంజుకోవడంతో సెనె్సక్స్ రికార్డుస్థాయిలో 34వేల 443.19 పాయింట్లకు చేరుకుంది. అలాగే నిఫ్టీ కూడా మరింతగా రాణించి 10637 పాయింట్ల వద్ద ముగిసింది. నేటి లావాదేవీల్లో వివిధ దశల్లో ఊగిసలాడిన సెనె్సక్స్ అంతిమంగా 0.26 శాతం అంటే 90.40 పాయింట్లు పెరిగి 34వేల 443.19 ముగిసిందని, ఏవిధంగా చూసినా ఇది లైఫ్‌టైం హై అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతకుముందు వరుస మూడు సీజన్లలో సెనె్సక్స్ మొత్తంగా 559.41 పాయింట్లమేర పుంజుకుంది. అలాగే ఎన్‌ఎస్సీలో కూడా బుల్న్ సాగింది. వివిధ దశల్లో ఊగిసలాడిన ఎన్‌ఎస్‌సి అంతమంగా 13.40 పాయింట్లు పెరిగి గత రికార్డులను చేధిస్తూ 10,637 వద్ద ముగిసింది. విదేశీ మదుపుదారులు భారీగానే మూలధానాన్ని సమకూర్చడం కూడా మార్కెట్ పుంజుకోడానికి దారితీసింది. ఇప్పటికే విదేశీ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు 693.82 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అలాగే స్వదేశీ సంస్థాగత ఇనె్వస్టర్లు 206.30 కోట్ల మేర షేర్లను విక్రయించారు.