బిజినెస్

ఇక రైతు ముంగిటకు నేరుగా ఎరువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 10: తమ వెబ్‌సైట్ ద్వారా ఎరువులను కొనుగోలు చేస్తే వాటిని నేరుగా రైతుల ఇళ్లవద్దకు ఉచితంగా చేరవేస్తామని ‘ఇఫ్కో’ (ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కో-ఆపరేటివ్) ప్రకటించింది. ఈ తరహా సేవలను అందించేందుకు ‘ఇఫ్కో’ ఇటీవల ‘సహకార డిజిటల్ వేదిక’ను (తీతీతీ.జచిచిజష్యఇ్ఘచ్ఘీ.జశ) ప్రారంభించింది. 13 ప్రాంతీయ భాషల్లో ప్రారంభించిన ఈ వేదికలో ఇప్పటికే సభ్యుల సంఖ్య రెండున్నర కోట్లకు చేరింది. ‘ఇఫ్కో’తో పాటు దాని అనుబంధ సంస్థలతో రైతులు అనుసంధానం అయ్యేందుకు ‘సహకార డిజిటల్ వేదిక’ను ప్రారంభించారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమను మరింత బలోపేతం చేసేలా గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత సేవలను అందించేందుకు ‘ఇఫ్కో’ నిర్ణయం తీసుకుంది. ఎరువులు, ఇతర వ్యవసాయ పనిముట్లను వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేసే రైతులకు వాటిని ఇంటివద్దకు చేరవేయడం దేశంలోనే ప్రథమమని ‘ఇఫ్కో’ మేనేజింగ్ డైరెక్టర్ యుఎస్ అవస్థి తెలిపారు. మారుమూల ప్రాంతాల రైతులకు సైతం ఈ ఉచిత సేవలు లభిస్తాయని వివరించారు. ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాలు, చిన్న చిన్న వ్యవసాయ పనిముట్లను కొనుగోలు చేసే రైతులకు ఈ ఉచిత సేవలు అందుతాయి. అయిదు కిలోల ప్యాకెట్లలో లభించే ఎరువులను కొనుగోలు చేస్తే ఎలాంటి రవాణా చార్జీలు ఉండవు. అయితే- యూరియా, డిఏపీ, ఎన్‌పీకే వంటి సంప్రాదాయ ఎరువులను మాత్రం ఆన్‌లైన్‌లో విక్రయించరు. వెబ్‌సైట్ ద్వారా ఎరువులను కొనుగోలు చేయడం, డిజిటల్ చెల్లింపులు వంటి విషయాల్లో రైతులకు అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇస్తామని ‘ఇఫ్కో’ ప్రకటించింది. రైతులు, సహకార సంఘాలు వ్యవసాయ ఉత్పత్తులను ఆన్‌లైన్ ద్వారా విక్రయించేందుకు త్వరలో ఏర్పాట్లు చేస్తామని అవస్థి తెలిపారు. తమ సంస్థలో సభ్యులుగా ఉన్న 5 కోట్ల మంది రైతులను, 36వేల సహకార సంఘాలను ‘డిజిటల్ వేదిక’లో భాగస్వామ్యం చేసేందుకు కార్యాచరణను అమలు చేస్తామని ఆయన చెప్పారు.