బిజినెస్

హాస్టల్ మెస్‌లపై జీఎస్టీ 5 శాతమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 10: విద్యార్థులు, సిబ్బంది కోసం విద్యాసంస్థలు నిర్వహించే హాస్టల్ మెస్‌లకు 5 శాతం జీఎస్టీ (వస్తు సేవా పన్ను) మాత్రమే వర్తిస్తుందని ఆర్థిక మంత్రిత్వశాఖ బుధవారం ప్రకటించింది. హాస్టళ్లను విద్యాసంస్థలు నడిపినా, బయటి వ్యక్తులు నడిపినా కనిష్ఠ స్థాయిలోనే జీఎస్టీ ఉంటుంది. కాలేజీ హాస్టళ్లకు సంబంధించి పన్నులు, జీఎస్టీ విషయమై వినవస్తున్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సయిజ్ అండ్ కస్టమ్స్’ (సీబీఎస్‌సి) ఈ మేరకు వివరణ ఇచ్చింది. మెస్‌లు అందజేసే ఆహారం, పానీయాలపై 5 శాతం మాత్రమే జీఎస్టీ ఉంటుందని, హాస్టళ్లను ఎవరు నడిపినా ఈ నిబంధన వర్తిసుందని సీబీఎసీసి స్పష్టం చేసింది. జీఎస్టీ అమలులోకి వచ్చాక 12 రకాల స్థానిక పన్నుల నుంచి విముక్తి లభించింది. జీఎస్టీ విధానంతో 5,12, 18,21 శాతాలలో నాలుగంచెల పన్నుల పద్ధతి అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే.