బిజినెస్

పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని ధర్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 10: ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులకు రాష్ట్రంలో పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని, దేశంలోనే తొలిసారిగా గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ అమలు కోసం సీఎం చంద్రబాబు ఆరు మాసాల క్రితం జారీ చేసిన 107, 121 జీవోల తక్షణ అమలు కోరుతూ ఈ నెల 12న రాష్టవ్య్రాప్తంగా నిరసనోద్యమం చేపట్టబోతున్నామని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్, రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఆరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇబ్రహీంపట్నంలోని రాష్ట్ర ఖజానా శాఖ సంచాలకుని కార్యాలయం ఎదుట, అదే సమయంలో 13 జిల్లాల ట్రెజరీ కార్యాలయాల ఎదుట భారీగా ధర్నాలు నిర్వహిస్తామన్నారు. ఉపాధ్యాయులకు సెలవులేనని, ఇతర ఉద్యోగులందరూ ఆరోజు అరపూట మూకుమ్మడి సెలవు పెట్టనున్నారని తెలిపారు. ఈ ఆందోళన తరువాత కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో ఇక తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని బొప్పరాజు హెచ్చరించారు. ఐదేళ్లపాటు పనిచేసే ప్రజాప్రతినిధులకు పెన్షన్లు ఇస్తూ, 30ఏళ్లకు పైగా అంకితభావంతో పనిచేసే వారికి పెన్షన్ లేకుండా వారిని అభద్రతాభావంలోకి నెట్టివేయడం సరికాదన్నారు. ఈ ఆందోళనలో ఏపీజేఏసీ అమరావతి పరిధిలోని 90 ఉద్యోగ సంఘాలు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం, ఉపాధ్యాయుల సంఘాలు (జాక్టో) కలిసి పాలుపంచుకోబోతున్నాయని రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన తెలిపారు. జేఏసీ అమరావతి సెక్రటరీ జనరల్, కోఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేట్ అధ్యక్షుడు టీవీ ఫణిపేర్రాజు, జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డీ ఈశ్వర్, రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేట్ ఉపాధ్యక్షుడు ఎంవీ రమణ, విజయవాడ అధ్యక్షుడు డీ శ్రీనివాస్, సీసీఎల్‌ఏ విభాగం అధ్యక్ష కార్యదర్శులు బీ పుల్లయ్య, దుర్గాప్రసాద్, కార్మిక శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టీ రాజేష్, సంయుక్త కార్యదర్శి వీఎన్ బిందు పాల్గొన్నారు.