బిజినెస్

నిల్వ సామర్థ్యం లేకే నష్టం ఏటా రూ.70 వేల కోట్ల ఆహార పదార్థాలు వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 10: రైతులు పండించే పంటను నిల్వచేసుకుని, గిట్టుబాటు ధర లభించినప్పుడు విక్రయించుకునే అవకాశాల్లేక రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. తద్వారా సాలీనా రూ.70వేల కోట్ల మేర ఆహార పదార్థాలు వృథాగాపోతున్నాయి. కోల్డ్ స్టోరేజ్‌ల సామర్థ్యం పెంచితేనే రైతుకు తద్వారా దేశానికి మేలు చేకూరుతుందన్నది రైతుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ హీటింగ్, రిఫ్రిజిరేటింగ్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఇంజనీర్స్ (ఐఎస్‌హెచ్‌ఆర్‌ఏఈ), ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రిఫ్రిజిరేషన్ అండ్ కోల్డ్ చైన్ జాతీయ సదస్సు విశాఖలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఇష్రా ప్రతినిధి అరవింద్ సురంగి మాట్లాడుతూ పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలోను, పండ్ల ఉత్పత్తిలో ద్వితీయ స్థానంలోను, ఆక్వా ఉత్పత్తుల్లో తృతీయ స్థానంలోను ఉన్న భారతదేశంలో వీటిని నిల్వచేసుకునే విషయంలోనే వెనుకబడి ఉన్నామన్నారు. పండించిన పంటను నిల్వచేసుకుని, డిమాండ్‌ను బట్టి విక్రయించుకునే వెసులుబాటు రైతుకు లేకుండా పోయిందన్నారు. ముఖ్యంగా ఆహార ఉత్పత్తులు ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునేలా కోల్డ్ స్టోరేజ్‌లను అందుబాటులో ఉంచడం ద్వారా రైతాంగానికి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఉత్పత్తి పెరిగి డిమాండ్ తగ్గినప్పుడు పంటను భద్రపరచుకునే అవకాశం కల్పించాల్సి ఉందన్నారు. దేశంలో సరైన కోల్డ్ స్టోరైజ్ అవకాశాల్లేక సాలీనా రూ.70 వేల కోట్ల ఆహార ఉత్పత్తులు వృధా అవుతున్నాయన్నారు. దేశంలో దాదాపు 4,000 కోల్డ్ స్టోరేజ్‌లు ఉండగా, వీటిలో అత్యధిక శాతం ఉత్తర భారతంలోనే ఉన్నాయన్నారు. ఏపీ విషయానికొస్తే గుంటూరులో మిర్చి పంటను నిల్వ చేసుకునేందుకు మాత్రమే కోల్డ్ స్టోరేజ్ సదుపాయం ఉందన్నారు. ఇక రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలను పరిశీలిస్తే కోల్డ్ స్టోరేజ్ సదుపాయం నామమాత్రమే. ప్రస్తుతం కర్నాటక రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం పెద్ద ఎత్తున కోల్డ్ స్టోరేజ్‌లను ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటకు రక్షణ కల్పిస్తోందన్నారు. ఏపీలో కూడా ఇటువంటి పరిస్థితులు రావాల్సి ఉందన్నారు. కేంద్రం కూడా కోల్డ్ స్టోరేజ్‌లకు భారీ ఎత్తున లబ్ధి చేకూర్చే విధంగా రాయితీలు ప్రకటిస్తున్న నేపథ్యంలో వీటిని రైతులకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందన్నారు. ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సాంబశివరావు మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించే వరకూ ఉత్పత్తులను నిల్వ చేసుకునేలా కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు కల్పిస్తే అటు రైతుకు, ఇటు దేశానికి మేలు చేకూరుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.