బిజినెస్

తెనాలి సబ్ ట్రెజరీలో స్కాంపై శాఖాపరమైన విచారణ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 10: దాదాపు 15 నెలల క్రితం గుంటూరు జిల్లా తెనాలి సబ్ ట్రెజరీ కార్యాలయంలో జరిగిన కోటీ 20 లక్షల రూపాయల ఆర్థిక పరమైన కుంభకోణంపై బుధవారం శాఖాపరమైన విచారణ ప్రారంభమైంది. తూర్పు గోదావరి జిల్లా ఉప సంచాలకులు జోగారావు ఆ కార్యాలయ ప్రాంగణంలోనే తొలిరోజు ప్రధాన నిందితుడైన జూనియర్ అసిస్టెంట్ వరుణ్‌బాబును విచారించారు. నాడు సబ్ ట్రెజరీ అధికారిగా వ్యవహరించి ఇటీవలే పదవీ విరమణ చేసిన రాయల్‌ను గురువారం విచారించనున్నారు. నాడు కార్యాలయంలో వివిధ విభాగాల్లో పనిచేసిన మొత్తం 15 మందికి నోటీసులు జారీ కాగా, వీరిని కూడా విచారించాల్సి ఉంది. తండ్రి అకాల మరణంతో ఉద్యోగంలో చేరిన వరుణ్‌బాబు నాటి ఎస్‌టీవో సహాయంతో పాస్‌వర్డ్ తెలుసుకొని తెనాలి మున్సిపాల్టీ, ఇతర ప్రభుత్వ శాఖల నిధుల నుంచి దశలవారీగా తన సొంత ఖాతాలు, బినామీ ఖాతాలకు నిధులు తరలించాడనేది ప్రధాన అభియోగం. ఇటు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు కాని, అటు ట్రెజరీ అధికారులు గానీ ట్రెజరీ శాఖలోనే తొలిసారి మాయనిమచ్చగా నిలిచిన ఈ భారీ స్కాంను గుర్తించలేకపోయారు. ఈ ఉద్యోగి ఒక్కసారిగా విలాసవంతమైన జీవితం గడుపుతుండటాన్ని గుర్తించిన స్థానికుల నుంచి వచ్చిన ప్రచారంతోనే ఆ గుట్టు రట్టయింది. ఆలస్యంగా కళ్లు తెరిచిన ట్రెజరీ ఉన్నతాధికారులు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయించి అతన్ని సస్పెండ్ చేశారు. కొద్దికాలానికి నాటి ఎస్‌టీవో రాయల్ రిటైరయ్యారు. ట్రెజరీ శాఖ డైరెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన టీ మోహనరావు అవినీతి, అక్రమాలన్నింటిని గుర్తించి అవాక్కయ్యారు. ఆపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో మరెందరి ప్రమేయం వెలుగుచూడనుందోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.