బిజినెస్

భారత్‌లో ‘నెట్’ వేగం తక్కువే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 10: మన దేశంలో ఇంటర్నెట్ వేగం తక్కువేనని వినియోగదారుల హక్కుల కోసం పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. దీంతో సర్వీస్ ప్రొవైడర్లు చెబుతున్న మాటలకు అర్థం లేదని స్పష్టమైంది. అంతర్జాతీయంగా చూస్తే భారత్‌లో ఇంటర్నెట్ వేగం అత్యంత తక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో గుర్తించారు. ఇంటర్నెట్ వేగం ఫర్వాలేదని కాని, బాగుందని కాని వినియోగదారులు ఎక్కడా చెప్పలేదని ‘కన్స్యూమర్ వాయిస్’ జరిపిన సర్వేలో తేటతెల్లమైంది. నామమాత్రంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించినంత మాత్రాన ‘డిజిటల్ ఇండియా’ ఆవిర్భవించదని, నాణ్యమైన సేవలతో పాటు తగినంత వేగం ఉంటేనే ఫలితం ఉంటుందని వినియోగదారులు తెలిపారు. కచ్చితత్వంతో పాటు సకాలంలో సాంకేతిక సేవలు అందేలా చర్యలు తీసుకున్నపుడే ‘డిజిటల్ ఇండియా’ కల సాకారం అవుతుందని చాలామంది కస్టమర్లు పేర్కొన్నారు. వైర్‌లెస్ ఇంటర్నెట్‌కు సంబంధించిన సేవలు కూడా సంతృప్తికరంగా లేవన్న ఫిర్యాదులు వినిపించాయి. వేగం తక్కువగా ఉన్నందున దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావడం లేదు. 3జీ, 4జీ సర్వీసుల పట్ల కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం కావడం గమనార్హం. ఇంటర్నెట్ వేగాన్ని పెంచేలా సర్వీస్ ప్రొవైడర్లతో పాటు ప్రభుత్వం కూడా నిర్ధిష్టమైన చర్యలను తీసుకోవాలన్న డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది.