బిజినెస్

బినామీలూ జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 10: బినామీ లావాదేవీలపై ఆదాయపన్ను (ఐటీ) శాఖ దృష్టిసారించింది. నిబంధనలు ఉల్లంఘించి లావాదేవీలు జరిపేవారిపై కొరడా ఝుళిపించాలని ఐటీ శాఖ నిర్ణయించింది. ఇక నుంచి బినామీ లావాదేవీలు చెల్లవు. కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టాలు బినామీలను ఓ కంటకనిపెడతాయి.
నిబంధనలు ఉల్లంఘించి బినామీలావాదేవీలు జరిపినట్టు తేలితే క్రిమినల్ చర్యలు ఉంటాయి. ఏడేళ్ల వరకూ జైలుశిక్ష విధించడానికి అకాశం ఉంటుందని ఐటీ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి జాతీయ దినపత్రికల్లో ఐటీ శాఖ అడ్వర్‌టైజ్‌మెంట్లు ఇచ్చారు. బినామీ లావాదేవీలకు దూరంగా ఉండండి, నల్లధనం తీవ్రమైన నేరం అంటూ తీవ్ర హెచ్చరిక చేశారు. అలాగే నల్లధనాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సహకరించండి అంటూ యాడ్‌లో విజ్ఞప్తి చేసింది. బినామీ పేర్లతో లావాదేవీలు జరిపితే చట్టం ఉపేక్షించదని, కఠిన శిక్షలు ఉంటారని ఐటీ పేర్కొంది. ఏడేళ్ల కఠిన కారాగారం విధిస్తారని అంటూ ‘ఎక్కడైనా బినామీ లావాదేవీలు బయటపడితే జైలుశిక్షతో సరిపెట్టరు. మీరు నడిపిన లావాదేవీలకు మార్కెట్ విలువకట్టి 25 శాతం వరకూ జరిమానా పడుతుంది’ అంటూ ఐటీ ప్రకటనలో స్పష్టం చేసింది. కొత్త బినామీ లావాదేవీల (ప్రొహిబిషన్) చట్టాన్ని 2016 నవంబర్ 1న సవరించినట్టు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 2016 నవంబర్ 1నుంచి 2017 అక్టోబర్ వరకూ 1,833 కోట్ల రూపాయల ఆస్తులను ఐటీ శాఖ అటాచ్ చేసింది. 517 మందికి నోటీసులు జారీ చేసి 541 అటాచ్‌మెంట్లు చేసినట్టు ఐటీ వెల్లడించింది. కొత్త చట్ట ప్రకారం ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్టు తేలితే క్రిమినల్ చర్యలుంటాయి. అలాగే ఐదేళ్ల జైలుశిక్ష పడుతుందని ఆదాయపన్నుశాఖ హెచ్చరించింది. బినామీ ఆస్తుల్లో మార్కెట్ విలువకు 10 శాతం వరకూ జరిమానా తప్పదు. ఇది కాకుండా ఆస్తులను అటాచ్ చేసి 1961 ఆదాయపన్ను చట్టం కింద చర్యలు తీసుకుంటారని యాడ్‌లో హెచ్చరించారు.